38.2 C
Hyderabad
April 29, 2024 22: 19 PM
Slider జాతీయం

బీ అలర్ట్‌: అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మోహరింపు

ins vikramaditya

భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. చైనా- పాకిస్తాన్‌లు సంయుక్తంగా సోమవారం నుంచి అరేబియా సముద్రంలో తొమ్మిది రోజుల పాటు భారీ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్‌ తన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను తీరప్రాంతంలో మోహరించింది. మిగ్‌ 29కె యుద్ధవిమానంతో కూడిన ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహక నౌకను మోహరించే సమయంలో నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధి కారులు అందులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య అంతర్‌ కార్యాచరణ, వ్యూహాత్మక సహకారం లక్ష్యంగా ‘సీ గార్డియన్స్‌’ పేరుతో చైనా- పాక్‌లు ఈ విన్యాసాలను ప్రారంబించనున్నాయి. ఇందులో ఇరుదేశాల జలాంతర్గాములు, విధ్వంసక నౌకలు, యుద్ధనౌకలు భాగం కానున్నాయి.

Related posts

జాతీయ స్థాయి పేద క్రీడాకారిణికి ఆర్థిక సహాయం

Satyam NEWS

పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలి

Satyam NEWS

తాగి వాహనం నడిపినా పోలీసులు వాహనాన్ని ఇక సీజ్ చేయలేరు

Satyam NEWS

Leave a Comment