38.2 C
Hyderabad
May 2, 2024 21: 19 PM
Slider మహబూబ్ నగర్

అధికారులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

#training

అధికారులు  తాము పనిచేయడమే కాదు కింది స్థాయి ఉద్యోగులచే పూర్తిస్థాయిలో పని చేయించుకునే నైపుణ్యం ఉండాలి అందుకు తగిన ప్రేరణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆదివారం జిల్లా అధికారులకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పేజ్-1 అతిథి గృహం నార్లాపూర్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు నిష్ణాతులచే ప్రేరణ తరగతి నిర్వహించారు. 

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు వేణు భగవాన్, రామ్ జలదుర్గం, పారితోష్ శరన్ ల ద్వారా ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమ విధి నిర్వహణలో ఎంతోమందికి సమాధానాలు, సమస్యల పరిష్కారం ఇతర వత్తిడులకు గురి అవుతుంటారన్నారు.  ఇలాంటి ప్రేరణ తరగతుల ద్వారా తమ వత్తిడి దూరం చేసుకొని లక్ష్యం దిశగా పని చేసేందుకు దోహదపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ మొటివేషన్ తరగతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  దీనిని అధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు వేణు భాగవాన్ వివరిస్తూ మనిషి ఎప్పుడు మన లక్ష్యం పైనే పూర్తిగా దృష్టి సారించాలని అప్పుడు ఏ అడ్డంకులు వచ్చిన తొలగిపోతాయని, లక్ష్యం గొప్పదైనప్పుడు సమస్య చాలా చిన్నదై పోతుందని అధికారులకు ప్రేరణ కల్పించారు. 

ఉదయాన్నే శాంతివనం ధ్యాన కేంద్రం శిక్షకుడు అంజయ్య చేయించిన ధ్యానం, వ్యక్తిత్వ వికాసం నిపుణులు వేణు మాధవ్, పరితోష్ శరన్,రామ్ జలదుర్గం ద్వారా  ప్రేరణ కల్పించేందుకు ఆడించిన ఆట ఎంతగానో ఆకట్టుకున్నాయని రోజు మొత్తాన్ని చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఆస్వాదించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.  ఇంతమంచి మొటివేషన్ తరగతి ఏర్పాటు చేసినందుకు అధికారులు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

కరెంటు చార్జీల మళ్లీ పెంచిన జగన్ రెడ్డి

Satyam NEWS

పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వైపు ప్రజలు వెళ్లేలా చేయాలి

Satyam NEWS

24 న సూర్యాపేటకు కేసీఆర్

Bhavani

Leave a Comment