30.7 C
Hyderabad
April 29, 2024 06: 06 AM
Slider గుంటూరు

నరసరావుపేటలో ఇంటర్నేషనల్ స్థాయి డయాగ్నస్టిక్ సేవలు

#SP Bindu Madhav

పల్నాడు జిల్లా నరసరావుపేటలో శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఇంటర్నేషనల్ స్థాయి విట్రోస్ 4600 డయాగ్నస్టిక్ మిషన్ తో రోగులకు అన్ని రకాల రక్త పరీక్షలు అత్యంత ఖచ్చితత్వంతో, తక్కువ వ్యవధి లోనే లభిస్తుండటం పల్నాడు జిల్లాకే గర్వకారణమని జిల్లా అడిషనల్ ఎస్పీ బిందు మాధవ్ అన్నారు.

నరసరావుపేట పట్టణంలోని ట్రినిటీ డయాగ్నస్టిక్ సెంటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ వారి నూతన డ్రై కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ ను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీ దత్త హాస్పిటల్ సిఎండి డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ మాట్లాడుతూ మానవ తప్పిదాలు మానవ రహిత తప్పిదాలు లేకుండా వంద శాతం ఖచ్చితత్వంతో పరీక్ష నమూనాలు ఉంటాయని తెలిపారు. గంటకు 600 టెస్టులు రిజల్ట్ అతి తక్కువ వ్యవధిలో తీయవచ్చు అని తెలిపారు. లిక్విడ్ వాడకపోవటం వల్ల జీరో పర్సెంట్ ఎర్రర్ ఉంటుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా ఈ మిషన్ ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా 15 రోజులు పాటు వెయ్యి రూపాయల ఖరీదు చేసే పరీక్షలు ఉచితంగా చేస్తారని, ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ డిఎస్పీ సిహెచ్ విజయభాస్కరరావు, సిఐ అశోక్ కుమార్, ఎస్ ఐ వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కపిల వాయి విజయ్ కుమార్, పలువురు డాక్టర్ లు పాల్గొన్నారు.

Related posts

కొత్తవలస పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ దీపికా

Satyam NEWS

చైనాలో ప్రమాదకరంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

వక్ఫ్ బోర్డు అధికారులకు కనువిప్పు కలగాలని అల్లాకు వినతి

Satyam NEWS

Leave a Comment