29.7 C
Hyderabad
May 7, 2024 03: 13 AM
Slider హైదరాబాద్

కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందే మహిళాదినోత్సవం

#womensday

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని బాగ్ అంబర్ పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి అన్నారు. ఆలీ కేఫ్ చౌరస్తా లోని క్రిష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో చిన్నారులు, యువతలతో పాటు ఆమె పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చిందన్నారు.

దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నావారందరికీ భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్  

Related posts

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోళి పండుగ సంబురాలు

Satyam NEWS

ఆన్ లైన్ సెంటర్ల వద్ద జర్నలిస్టుల అగచాట్లు

Satyam NEWS

ఇన్ సైడర్ ట్రేడింగ్: ఆగుతారా… మరో కొత్త ఆలోచనతో కేసులు పెడతారా?

Satyam NEWS

Leave a Comment