39.2 C
Hyderabad
April 28, 2024 12: 58 PM
Slider ప్రత్యేకం

మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం

#roshapati

ఆకాశంలో సగం నిన్నటి మాట. ఆకాశంమే తమ వశం కావాలి అన్నది ఆధునిక మహిళల మాట. కాని అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 33 శాతం రాజకీయ,ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందేయని,భారతదేశంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తీవ్రంగా విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పరిశ్రమ ప్రాంతంలో బుధవారం మహిళా కార్మికులతో రోషపతి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం నుండి 33 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్,బిజెపి పార్టీలు దొంగాట లాడి బిల్లు ఆమోదం తెలపలేదని అన్నారు.ఇప్పటికైనా కేంద్ర లోని బిజెపి ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ ఆమోదం తెలపాలని,దీనికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు,మేధావి వర్గాలు రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పట్టుబట్టి ఆమోదింప చేయాలని కోరారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి మహిళలకు ఆస్తిలో సగం హక్కు కల్పిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని గుర్తు చేశారు.ఇంటి వేధింపులు చట్టం, పనిచేస్తున్న చోట వేధింపులు,యాసిడ్ దాడులు,మహిళల ఆస్తి హక్కు చట్టం అమలు చేసిన రోజే భారతదేశం అభివృద్ధి చెందుతుందని శీతల రోషపతి అన్నారు. ఈ కార్యక్రమంలో స్వాముల కోటమ్మ, మున్ని,స్వరూప,మంగమ్మ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఐఎంఎఫ్ అంచనాలపై ఆందోళన వద్దు

Satyam NEWS

రక్తదానం చేసిన సాయిధరమ్ తేజ్ యువత

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: స్కూళ్లు బహిరంగ స్థలాలు, బార్లు, క్లబ్బులు బంద్

Satyam NEWS

Leave a Comment