37.2 C
Hyderabad
May 2, 2024 14: 04 PM
Slider నల్గొండ

లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి

#Congress Protest on current bills

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అధ్యక్షతన సోమవారం కరెంటు బిల్లులపై నిరసన కార్యక్రమం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కరెంటు బిల్లులు ఎక్కువ మోతాదులో జారీ చేసినందుకు హుజూర్ నగర్ పట్టణంలోని ఏడి కార్యాలయం ముందు నల్ల రంగు జెండాలు, బ్యాడ్జీలతో,నోటికి నల్లరంగు మాస్కులు ధరించి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.

అనంతరం స్థానిక ఏడికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున రావు, రాష్ట్ర  ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, రాష్ట్ర సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు చక్కెర వీరారెడ్డి, మాజీ జెడ్ పి టి సి గల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి లాక్ డౌన్ కాలంలోని మూడు నెలలు విద్యుత్తు బిల్లు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించినందు వల్ల ఆర్థికంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, తినటానికి తిండి కరువైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి కరెంటు బిల్లుల రూపంలో పీడించి వసూలు చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

బతకడమే కష్టమైతే ఇప్పుడు కరెంటు బిల్లులా?

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వలె విద్యుత్తు బిల్లును టెలిస్కోపు పద్ధతిలో అమలు చేయాలని,లాక్ డౌన్ సమయంలో చిన్న వ్యాపారస్తులకు విద్యుత్ బిల్లు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజువారీ కూలీలు, సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి బ్రతకటమే కష్టంగా ఉన్నా ఈ సమయంలో మూడు నెలల అధిక విద్యుత్తు బిల్లుల భారం ప్రజలపై మోపి కరెంటు బిల్లు కట్టండి లేదా కరెంటు కట్ చేస్తాం అనడంతో ప్రజానీకం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని అన్నారు.

ఇది రాష్ట్ర ప్రభుత్వానికి క్షేమకరం కాదని వారన్నారు. లాక్ డౌన్ కాలానికి విద్యుత్తు బిల్లును పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సింది  పోయి, రద్దు చేయకుండా రాష్ట్ర ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, నాన్ టెలిస్కోప్ విధానంతో కరెంటు రీడింగ్ లు తీసి మోయలేని భారాన్ని ఈ ప్రభుత్వం  ప్రజలపై మోపుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుంకరి శివరాం యాదవ్, ఎండి అజీజ్ పాషా,బాచిమంచి గిరిబాబు, జక్కుల మల్లయ్య, కోళ్ళపూడి యోహాన్, కౌన్సిల్  ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, కౌన్సిలర్లు తేజావత్ రాజా, ములకలపల్లి రామగోపి, కారంగుల వెంకటేశ్వర్లు, బెల్లం కొండ గురవయ్య, మేళ్లచెరువు ముక్కంటి పాల్గొన్నారు.

ఇంకా, వల్లపుదాసు కృష్ణ, ముశం సత్యనారాయణ, సమ్మెట సుబ్బరాజు, కంకణాల పుల్లయ్య, యడవెల్లి వీరబాబు, ఇంటిమళ్ళ బెంజిమన్, బచ్చు రామారావు, దొంతగాని జగన్, సుదర్శన్, ఏ. శ్రీనివాస్, కుక్కడపు వీరబాబు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగు తెరకు తిరుగులేని విలన్: హ్యారి జోష్

Satyam NEWS

మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఈ నెల 21 కి వాయిదా

Satyam NEWS

Leave a Comment