37.2 C
Hyderabad
April 26, 2024 22: 20 PM
Slider ఆదిలాబాద్

అంబేద్కర్, పూలే చరిత్ర సిలబస్ తగ్గించడం అన్యాయం

#Dr.BRAmbedkar

తెలంగాణ ఇంటర్ పాఠ పుస్తకాలలో అంబేద్కర్, పూలే పాఠాల తొలగింపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని OU విద్యార్థి JAC రాష్ట్ర కార్యదర్శి అన్నం నాగార్జున అన్నారు.

కరోనా నేపథ్యంలో CBSE ఆదేశాల మేరకు 30 శాతం ఇంటర్ సిలబస్ ను తగ్గిస్తున్నారని ఆయన తెలిపారు.

అయితే ఈ తొలగిస్తున్న పాఠ్యాంశాలలో జాతీయ నాయకులైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, పూలే  జీవిత చరిత్ర ఉండటం శోచనీయమని ఆయన అన్నారు.

ఇంటర్ బోర్డు పాఠ పుస్తకాల నుండి తొలగింపు పై ఎక్స్పర్ట్ కమిటీ చేసిన సూచనను ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థి JAC వ్యతిరేకిస్తున్నదని ఆయన అన్నారు

అంబేద్కర్, పూలే  జీవిత చరిత్రను మళ్లీ ఇంటర్ పాఠ్య పుస్తకాలల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

పాఠ్యాంశాలు మార్చకపోతే OU విద్యార్థి JAC పక్షాన ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు.

Related posts

చైనాలో మళ్ళీ కరోనా .. విమానాల రద్దు.. స్కూల్స్ బంద్..

Sub Editor

ట్రయల్ కోర్టు తర్వాత సుప్రీందే తుది నిర్ణయం కావాలి

Satyam NEWS

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Murali Krishna

Leave a Comment