38.2 C
Hyderabad
April 29, 2024 20: 27 PM
Slider ముఖ్యంశాలు

ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన

#intuc

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా బందును జయప్రదం చేయాలని రాష్ట్ర ఐ ఎన్ టి యు సి  పిలుపు మేరకు గురువారం ఐ ఎన్ టి యు సి అనుబంధ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో పాత బస్టాండు  నుండి ఇందిరా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురువయ్య మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యలని,కేంద్ర ప్రభుత్వం తెస్తున్న రోడ్డు సేఫ్టీ బిల్లు 2019 ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.పెంచిన పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలను తగ్గించలని కోరారు.ఫిట్నేస్ రెన్యూవల్ గడువు ముగిసిన వాహనాలకు రోజుకు 50 రూపాయలు పెనాల్టీని వేంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నియెజకవర్గ ప్రదానకార్యదర్శి గుంటిక కరుణకర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ చింతకాయల రాము,ఐ ఎన్ టి యు సి నాయకులు సలిగంటి జానయ్య, రెడపంగు రాము,కస్తాల రవీందర్,ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షుడు దేశాగాని గోపయ్య,సుళ్ళురి సైదులు, యరగాని నాగరాజు,కాసార్ల పుల్లయ్య,గుండు సైదులు గౌడ్,యం. లింగయ్య,సోమగాని నాగేశ్వరరావు, కె.వేంకటేశ్వర్లు,దేశాగాని రవి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి…ఫైర్ సేప్టీ జాగ్ర‌త్తలు కూడా కంప్ల‌స‌రీ…!

Satyam NEWS

రేపు గవర్నర్ తో భేటీ కానున్న సిఎం జగన్

Satyam NEWS

Analysis: ఐదు రాష్ట్రాలూ మారనున్న జాతకాలు

Satyam NEWS

Leave a Comment