26.7 C
Hyderabad
April 27, 2024 09: 40 AM
Slider ముఖ్యంశాలు

క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి…ఫైర్ సేప్టీ జాగ్ర‌త్తలు కూడా కంప్ల‌స‌రీ…!

#RDOvijayanagaram

దీపావ‌ళి సంద‌ర‌ర్బంగా క్రేక‌ర్స్ అమ్మ‌క‌,కొనుగోలుకు సంబంధించి అధికారుల‌తో ఆర్డీఓ స‌మావేశం…!

వ‌చ్చేనెల 4 దీపావ‌ళి… ఆ సంద‌ర్బంగా వినియోగించే పైర్ క్రేక‌ర్స్  అమ్మ‌కం,కొనుగోలుకు సంబంధించి పోలీసు,అగ్నిమాప‌క‌,మున్సిప‌ల్ శాఖ అధికారుల‌తో విజ‌య‌న‌గ‌రం ఆర్డీఓ భ‌వానీశంక‌ర్  జిల్లా కేంద్రంలోని త‌న ఛాంబ‌ర్ లో స‌మావేశం నిర్వ‌హించారు.క‌రోనా  మూలంగా ఈకోఫ్రెండ్లీ విధానంతో దీపావ‌ళి క్రేక‌ర్స్ అమ్మ‌క‌,కొనుగోళ్ల‌పై దృష్టి సారించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.ముఖ్యంగా సోష‌ల్ డిస్ట‌న్స్, శానిటైజ‌ర్,మాస్క్ త‌ప్ప‌న స‌రి అని  ఆ మూడు  అటు అమ్మ‌కం దారుడు,ఇటు  కొనుగోలుదారుడు పాటించేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

అలాగే న‌గ‌రంలోని కేఎల్ పురం జాతీయ ర‌హ‌దారిపై ఇరువైపు షాపులు పెట్టుకుని అమ్ముకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.మొత్తం ర‌మార‌మి 32  షాపులు లైసెన్స్ కు ధ‌ర‌ఖాస్తుకుపెట్టుకున్నాయ‌ని చెప్పారు.ఇక  క్రేక‌ర్స్  ధ‌ర‌ల విష‌యంలో వ‌స్తువుకు అనుగుణంగా నిర్ణయించాల‌ని..అదే విధంగా ఫైర్ సేప్టీ చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని  ఆ విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అగ్నిమాప‌క‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులకు ఆదేశాలుఇచ్చారు…ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్.ఈ స‌మావేశంలో మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ వర్మ‌,వన్ టౌన్ ఎస్ఐ సూర్య‌నారాయ‌ణ‌, అగ్నిమాప‌క‌శాఖ అధికారి త‌దిత‌ర‌లు హాజ‌ర‌య్యారు.

Related posts

కెసిఆర్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా ఉపద్రవం

Satyam NEWS

రెండు గంటల పాటు whats app కు గ్రహణం!

Satyam NEWS

అధికార పార్టీకి అభ్యర్ధి లేని నియోజకవర్గం ఏదో తెలుసా?

Bhavani

Leave a Comment