26.7 C
Hyderabad
May 15, 2024 11: 03 AM
Slider ప్రపంచం

ఓత్:ఇరాక్ కొత్త ప్రధాని గా టావ్‌ఫిక్‌ అల్లావి

irak new priminister aalavi voth

ఇరాక్ కొత్త ప్రధాని గా టావ్‌ఫిక్‌ అల్లావి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు ప్రధానిగా ఉన్న అడెల్‌ అబ్దుల్‌ మహది రాజీనామా చేయాగ అల్లావి ఈ బాధ్యతలు స్వీకరించారు. నూతన ప్రధాని అల్లావి మాట్లాడుతూ ‘మీలో ఒకడిగా నేను అధికారానికి వచ్చాను. మీ ధైర్య సాహసాలు, త్యాగాల నుంచి ఈ పదవి లభించింది. అది కాదనుకుంటే దేశంలో మార్పులేమీ ఉండవు’ అని అన్నారు.

మీ సొంత దేశంలోనే నిరసన తెలుపుతున్నారు.మీ డిమాండ్లను నేను నెరవేర్చలేకపోతే ఈ పదవికి నేను అర్హుడిని కాదు అని అన్నారు. తనపైన ఎవరైనా ఒత్తిడి చేస్తే రాజీనామా చేస్తానని అన్నారు.ప్రభుత్వ విధానాలను తిరస్కరిస్తూ ఇరాక్‌ ప్రజలు నిర్వహిస్తున్న నిరసన ఉద్యమం ఐదో నెలకు చేరింది.ఉద్యమం ప్రారంభమైన తర్వాత దాదాపు 500 మంది మృతి చెందగా, 9 వేల మంది గాయపడ్డారు.

మృతుల కటుంబాలకు పరిహారం చెల్లిస్తానని అల్లావి వాగ్దానం చేశారు. 30 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి పార్లమెంట్‌ ఆమోదం పొందుతానని ఆయన తెలిపారు.

Related posts

మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసే కుట్ర

Bhavani

కొల్లాపూర్ లో దళిత కుటుంబంలో ప్రతి ఒకరికి 10 లక్షలు ఇవ్వాలి

Satyam NEWS

డేంజర్ ట్రెడిషన్ : తమిళనాడులో మొదలైన జల్లికట్టు

Satyam NEWS

Leave a Comment