అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్నఅభిశంసనపై సెనెట్‌లో సోమవారం తిరిగి విచారణ ప్రారంభమైంది. సోమ, మంగళవారాలలో తుది విచారణ అనంతరం బుధవారం సభలో ఓటింగ్ జరుపుతారు.. గత డిసెంబర్‌లో ప్రతినిధుల సభలో ట్రంప్‌పై అభిశంసనను ఆమోదించారు. అనంతరం స్పీకర్ నాన్సీ పెలోసీ ట్రంప్ అధికార దుర్వినియోగం, సభా విచారణకు ఆటంకం అభియోగాలను సెనెట్‌కు పంపారు.
సెనెట్‌లో డెమోక్రాట్ల తరఫున న్యాయ వాదులు , ట్రంప్ తరపున రిపబ్లికన్ న్యాయవాదులు తమ తమ వాదనలను వినిపించిన తరువాత విచారణ సోమవారానికి వాయిదా పడగా విచారణ తిరిగి ప్రారంభమైంది.బుధవారం సభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉండటం తానె ఈ ఓటింగ్ లో గెలుస్తానని నమ్మకం తో ఉన్నాడు ట్రంప్.ఓటింగ్‌కు ముందు సభలో మాట్లాడతానని గతంలో ట్రంప్ ప్రకటిం చారు