ఐఎస్ నేత స్ధావరం బేకరీ నా అంతే అయి ఉంటుందని ఆయన ఆకారాన్ని చూసిన నెటిజన్లు జోక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరు ఇతను అంటే ఇరాక్‌లోని మొసుల్‌లో పట్టుబడిన ఐసిస్ నేత, ప్రభోదకుడు, భారీకాయుడైన షిఫాల్ నిమనుఅరెస్ట్ అయితే చేసారు కానీ జైలుకు అతన్నితరలించేందుకు అధికారులు ముప్పతిప్పలు పడ్డారు.
130 కిలోలకు పైగా బరువున్న షిఫల్‌ను కారులో ఎక్కించలేక ఆయన కోసం ప్రత్యేకంగా ట్రక్కును తెప్పించారు అక్కడి పోలీస్ అధికారులు..ఐసిస్ ప్రముఖ నేతగా పేరొందిన షిఫల్ నిమ జారీ చేసిన ఫత్వాలు కొందరి హత్యలకు దారితీశాయని ఇరాక్ పోలీసులు అతని పై చేసిన అభియోగం కాగా నిమ పట్టుబడటం ఐసిస్‌కు మానసికంగా కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.