33.2 C
Hyderabad
March 26, 2025 11: 02 AM
Slider ప్రపంచం

బాడీ ట్రెస్డ్:శవమై కనిపించిన సురీల్ దాబావాలా

america sureel

అమెరికాలోని భారతీయ సంతతి లో విషాదం నెలకొంది. గత డిసెంబరు నుండి కనిపించకుండాపోయిన సురీల్ దాబావాలా అనే 33 ఏళ్ల యువతి శవమై కనిపించింది. తన సొంత కారులోనే విగతజీవిగా పడివున్న సురీల్ ను ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ గుర్తించింది. చికాగో పరిసరాల్లో కారు డిక్కీలో సురీల్ మృతదేహం దుప్పట్లో చుట్టి ఉంది.

చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సురీల్ డిసెంబరు 30న అదృశ్యమైంది. ఆమె తండ్రి అష్రాఫ్ దాబావాలా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన కుమార్తె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల రివార్డు కూడా ప్రకటించారు.సురీల్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Related posts

శిధిలమైన తరగతి గదులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

Satyam NEWS

గోదారి ప్రాంతంలో రాత్రి తనిఖీలు చేసిన ములుగు ఎస్ పి

Satyam NEWS

మల్లయోధుడి తెరచాటు ప్రేమ కథ

Satyam NEWS

Leave a Comment