38.2 C
Hyderabad
April 29, 2024 11: 46 AM
Slider ప్రత్యేకం

ఎన్నికల కోడ్ అమలులో ఉందో లేదో చెప్పగలరా?

#electionscode

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో  ఉందా లేదా అనే సందిగ్ధం లో కొన్ని మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో గణపవరం తప్పిస్తే మొత్తం 27 మండలాలు ఉన్నాయి. వాటిలో జీలుగుమిల్లి, ఇరగవరంతో పాటు మరో మూడు మండల పరిషత్ ల సమావేశాలు జరిగాయని తెలిసింది. సాధారణంగా మండల పరిషత్  సమావేశం ప్రతి మూడు నెలల కొకసారి ఖచ్చితంగా జరగాలి అనేది ప్రభుత్వ నిబంధన. గత సమావేశం జరిగిన 90 రోజులలో తదుపరి సమావేశం జరపకపోతే మండల పరిషత్ బాడీ రద్దయ్యే అవకాశం ఉందనేది సమాచారం.

ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ అమలులోకొచ్చింది. కోడ్ అమలులో ఉన్న జిల్లాలలో ఎన్నికల కోడ్ ను ఖచ్చితంగా అమలు పర్చాల్సి ఉంది. మండల పరిషత్ ల సమావేశాల నిర్వహణకు ఎన్నికల కోడ్ ఎదురైంది. ఈ పరిస్థితుల్లో మండల పరిషత్ సమావేశాల నిర్వహణ కు ఎన్నికల కమిటీ అధికారులు జిల్లా అధికారుల నిర్ణయాలపై  ఆధారపడి ఉంటుంది. అయితే జిల్లా అధికారులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొన్ని మండల పరిషత్ కార్యాలయాల జనరల్ బాడీ సమావేశాలు కోడ్ నిబంధన లో కూడా జరిగినా అధికారులు పట్టించుకోలేదని సమాచారం. 

వాటిలో ఇరగవరం మండలపరిషత్ సమావేశం పెబ్రవరి (ఈ నెల)10వ తేదీన జరిగింది. జీలుగుమిల్లి మండల పరిషత్ సమావేశం కూడా ఈ నెల 14 వ తేదీన జరిగింది. ఈ మండల పరిషత్ అధికారులు కూడా సమావేశాలు నిర్వహించామని అంగీకరించారు. అయితే ఈ నెల 17వ తేదీ తో 3 నెలల కాలం పూర్తి కావస్తున్న కారణం తో  పెదవేగి మండల పరిషత్ సమావేశ నిర్వహణకు  ఫిబ్రవరి 4 వతేదీన నోటీసులు తయారు చేసి ప్రజాప్రతినిదులకి అధికారులకు మీడియాకి అందరికి సమావేశము జరుగు తేది  వివరిస్తూ నోటీసులు బట్వాడా చేశారు.

ఎన్నికల కోడ్  వచ్చినందున సమావేశం జరుపుటకు అనుమతి కావాలని పెదవేగి మండల పరిషత్ జిల్లా అధికారులను కోరినట్టు సమాచారం. దీనిపై సంబంధిత జిల్లా అధికారులనుండి ఏ విధమైన సమాచారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయానికి అందలేదు. జిల్లాలో ఇరగవరం, జీలుగుమిల్లి మండల పరిషత్ సమావేశాలు ఎన్నికల కోడ్ ఉన్నా జరగడం తో  ఫిబ్రవరి 15 వ తేదీన పెదవేగి మండల పరిషత్ సమావేశం నిర్వహణకు మండల పరిషత్ అధికారులు సిద్ధమయ్యారు.

ఎం పి టి సి లు, సర్పంచ్ లు అధికారులు  సమావేశానికి హాజరయ్యారు. ఒక గంటలో  సమావేశం ప్రారంభం అవుతుంది అనుకున్న టైంలో పెదవేగి మండల పరిషత్ సమావేశం తాత్కాలికంగా వాయిదా వేయాలని మండల పరిషత్ అధికారులకు జిల్లా అధికారులు ఫోన్ చేసి చెప్పడం తో పెదవేగి మండల పరిషత్ సమావేశం ఫిబ్రవరి 15 న తాత్కాలికంగా రద్దయ్యింది.

తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో అనేది జిల్లా అధికారుల ఆదేశాలపై ఆధార పడివుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఇరగవరం, జీలుగుమిల్లి మండల పరిషత్ సమావేశాల నిర్వహణకు అడ్డురాని ఎన్నికల కోడ్ పెదవేగి మండలం తో పాటు ఇతర మండల పరిషత్ కార్యాలయాలకు ఎలా వర్తిస్తుందని పెదవేగి మండల ఎం పి టి సి సభ్యులు. సర్పంచ్ లు ఎన్నికల సంఘాన్ని జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నారు.

దీనిపై పెదవేగి ఎం పి డి ఓ రాజ్ మనోజ్ ని వివరణ కోరగా ఎన్నికల కోడ్ వల్ల సమావేశం తాత్కాలికంగా వాయిదా వేయాలని జిల్లా అధికారుల నుండి ఆదేశాలు అందాయని అందువల్లే వాయిదా వేశామని, జిల్లా అధికారుల నుండి అనుమతి వచ్చిన వెంటనే సమావేశం జరుపు తేదీ తెలియజేయబడును అని తెలిపారు. అయితే ఓ జిల్లా స్థాయి అధికారి సామాజిక వర్గం జీలుగుమిల్లి, ఇరగవరం మండలాల అధికారులు  సామాజిక వర్గం ఒకటే కావడం తో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ  ఆ అధికారి  ఆ రెండు మండలాల సమావేశాల నిర్వహణకు అనుమతులిచ్చానే ఆరోపణలు ఆ అధికారిపై వినిపిస్తున్నాయి.

Related posts

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

Satyam NEWS

మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయలేరు

Satyam NEWS

స్పెషల్: కొల్లాపూర్ లో ప్రయివేటు దోవ పట్టిన పట్టణ ప్రగతి

Satyam NEWS

Leave a Comment