30.7 C
Hyderabad
April 29, 2024 04: 56 AM
Slider మహబూబ్ నగర్

మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయలేరు

మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల ఓటమి భయంతో మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసే పని చేస్తున్నారని, అవినీతి, అక్రమాలు తెలిసిన ఓటర్లు నమ్మే పరిస్థితిలో లేరని, డిసెంబర్ 3 తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి ఇంటికెళ్లడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేత రాచాల యుగందర్ గౌడ్ చెప్పారు.

మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచాల మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గoలోని పెద్దమందడి మండలం చిన్న మందడిలో సోమవారం రాత్రి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెచ్చిన మద్యం లారీని వెంబడించి అడ్డుకున్నామని , కానీ కొందరు బి ఆర్ ఎస్ నాయకులు అడ్డుకున్న నాపై కర్రలతో దాడికి యత్నించారని అన్నారు.అయినప్పటికీ పోలీసులకు మద్యం లారిని పట్టించడం జరిగిందని,పట్టుబడిన మద్యం దాదాపు 8160 (170 కాటన్లు×48) రాయల్ స్టాగ్ బాటిల్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు తెలిపారు.

బిఆర్ ఎస్ పార్టీ ఎన్నికల నిబంధనలు ఉల్లoఘించి మద్యం పంపిణి చేస్తున్నారని ఎన్నికల కమిషన్, జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశామని రాచాల వెల్లడించారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఓటమి భయంతో మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని…నీ గురించి గుర్తేరిగిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడ్డారని, బిఆర్ ఎస్ నాయకుల దౌర్జన్యలపై పలుమార్లు ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
గుడి, బడుల నుంచి సంతల వరకు ఏమీ వదలకుండా మంత్రి నిరంజన్ రెడ్డి వందల ఎకరాలు కబ్జా చేశారని ఒకప్పుడు ఏమి లేదని చెప్పిన మంత్రికి ఇన్ని వందల ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించారు.వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పేరుతో మంత్రి రూ.కోట్లు దండుకున్నారని, అవినీతి, కబ్జా కోరు మంత్రిని ఎన్నికల్లో ఓడించి ఫామ్ హౌస్ కు పంపించాల్సిన అవసరం నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. ఒక వ్యవసాయ మంత్రిగా ఉన్న నీవు ఇంత నీచ రాజకీయాలు చేయడం సిగ్గు చేటని, నీ దౌర్జన్య, అక్రమ, అరాచక రాజకీయాలకు డిసెంబర్ 3తర్వాత ప్రజలు స్వస్తి పలుకుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్, చీర్ల చందర్, శివ యాదవ్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

శ్రద్ధా వాకర్ హత్యకు మతం రంగు పులుముతున్న బీజేపీ

Bhavani

క్లీన్ అండ్ గ్రీన్: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం

Satyam NEWS

భద్రాచలం ప్రసాదం రేట్లు పెంపు

Satyam NEWS

Leave a Comment