28.7 C
Hyderabad
April 26, 2024 10: 25 AM
Slider మహబూబ్ నగర్

స్పెషల్: కొల్లాపూర్ లో ప్రయివేటు దోవ పట్టిన పట్టణ ప్రగతి

Kollapur pattana pragathi

పల్లె ప్రగతి అయిపోయింది ఇప్పుడు పట్టణ ప్రగతి స్టార్ట్ అయింది కదా? ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో యావత్తు తెలంగాణలో చేపట్టిన పల్లె ప్రగతి ఎంతో మేలుగా నడిచిందని ఊర్లు బాగు పడ్డయని భావించి సిఎం పట్టణ ప్రగతి మొదలు పెట్టారు. మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుని అందరికి గైడెన్సు ఇచ్చారు.

మరింకే అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నారా? అంతా బాగానే ఉంది. పట్టణ ప్రగతి అంటే అర్ధం మాత్రం కొల్లాపూర్ లోని పెద్ద నాయకులు మార్చేశారు. పట్టణ ప్రగతి అంటే పట్టణం బాగు చేయడం కాదు మేం బాగుపడటం అని వారు ఒక నిర్ణయానికి వచ్చేశారు. మేం బాగుపడితే పట్టణం బాగు పడ్డట్టే కదా అనుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని కొల్లాపూర్ లో ప్రైవేటు వ్యక్తుల సొంత స్థలాల్లో అమలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వ డబ్బులతో  జేసిబి తెచ్చి ప్రయివేటు ల్యాండ్స్ క్లీన్ చేసుకుంటున్నారు. వివరాలలోకి వెళితే కొల్లాపూర్ మున్సిపల్ ఐదవ వార్డ్ లో జరిగిన సంఘటన ఇది. వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైస్ చైర్మన్ మహిళ అయితే ఇక్కడ తన భర్త వ్యవహారంతోనే  వార్డులో ప్రగతి ప్రణాళిక ఏవిధంగా చేయాలో ఆదేశాలు ఇస్తున్నారని స్పెషల్ ఆఫీసర్ చెబుతున్నారు.

మంగళవారం నుండి ప్రారంభమైన పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డులో ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భవనాల,రోడ్లపై కంప చెట్లను జెసిబి లతో తొలగించాలి. అయితే ఇలా జరగకుండా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న జెసిబిలతో ప్రైవేట్ వారి స్థలాలలో కొన్ని ఒప్పందాలతో ముళ్ల పొదల్లోలను తొలగిస్తున్నారు.

అయితే దాని పక్కనే గురుకుల బీసీ గురుకుల పాఠశాల ఉన్నది. ఆ పాఠశాల కోసం తీసుస్తున్నారా?అని స్పెషల్ ఆఫీసర్ ను అడగగా అతను చెప్పిన విషయం ఏమిటంటే వైస్ చైర్మన్ భర్త ఇక్కడ తొలగించాలని ఆదేశించారని, అందుకే తొలగిస్తున్నామని చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే జెసిపి తొలగిస్తున్న సమయంలో వైస్ చైర్మన్ అధికారులు లేరు.

మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఉపయోగిస్తూన్నారంటే మరి దీన్ని ఎవరు అడ్డుకోవాలి? మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రే కదా? చూద్దాం ఏం జరుగుతుందో.

Related posts

ఉమెన్ పవర్: దేశ ఆర్ధిక వృద్ధికి చోదకులు మహిళలే

Satyam NEWS

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్

Satyam NEWS

ఉత్తమ ఉపాధ్యాయుడికి పాతనగర కవుల వేదిక సన్మానం

Satyam NEWS

Leave a Comment