37.2 C
Hyderabad
May 6, 2024 19: 56 PM
Slider హైదరాబాద్

బీసీలకు అన్నిరకాలుగా అండగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే

#Harish

తెలంగాణ చరిత్రలోనే బీసీ సంక్షేమ శాఖకు అత్యధికంగా 6229 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిందని గత ఎనిమిదిన్నర ఏళ్లలో కేవలం బీసీల కోసమే 48000 కోట్లను ఖర్చుచేసామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం బీసీలకు చంద్రభాబు ప్రభుత్వం 9ఏళ్లకు 2037కోట్లు కేటాయిస్తే, తదనంతరం కాంగ్రెస్ హయాంలో సైతం ఏనాడు వెయ్యికోట్లకు మించనీయకుండా బీసీలను వంచించారన్నరు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

కోకాపేట్లో బీసీ ఆత్మగౌరవ భవనాల సామూహిక శంకుస్థాపనల కార్యక్రమంలో సహచర మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్లతో కలిసి పాల్గొన్నారు. కోకాపేట్లో చెరో ఎకరం భూమిలో కోటి ఖర్చుతో ఆరెకటిక, గాండ్ల, చెరో 20 గుంటల భూమి యాబై లక్షల ఖర్చుతో రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాల భవనాలకు మంత్రులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. నేడు భూమిపూజ జరుపుకున్న సంఘాలతో కలిపి కోకాపేట్లో 13 కుల సంఘాలకు 37.20 ఎకరాలు 49కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో సభాద్యక్షత వహించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే బీసీల అభ్యున్నతి కోసం క్రుషి చేస్తుందని, గురుకులాలు, కళ్యాణలక్ష్మీతో పాటు కులవ్రుత్తులకు చేయూతగా ఉచిత కరెంటును అందించడమే కాక అత్యంత ఖరీదైన కోకాపేట, ఉప్పల్ భగాయత్లో వేల కోట్ల విలువైన స్థలాలను

కేటాయించిందన్నారు. బీసీల పట్ల ఆపేక్ష గల సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు 95.25 కోట్లు 87.3 ఎకరాలు కేటాయించారని, ఈ ఆత్మగౌరవ భవనాలను సైతం తమ కులం ఖ్యాతి ఇనుమడించేలా కట్టుకోవడానికి ఆయా సంఘాలకే అవకాశం కల్పించారని గుర్తుచేసారు మంత్రి గంగుల. నేడు భూమిపూజ జరుపుకున్న నాలుగు కుల సంఘాలతో కలిసి 29 బీసీ ఆత్మగౌరవ ట్రస్టులు ఏకమై తమ ఆత్మగౌరవం ప్రతిఫలించేలా భవనాలను నిర్మించుకుంటున్నాయన్నారు.

ఇన్నేళ్లపాటు బీసీలు వెనుకబడలేదని వెనుకకు నెట్టేయబడ్డారని, అలాంటి స్థితిగతులను పారద్రోలాలని క్రుషి చేస్తున్న సీఎం కేసీఆర్ కి మనమందరం నిండు నూరేళ్లు చల్లగా వర్థిల్లాలని దీవెనార్థులు పెట్టి అండగా నిలవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.

అనంతరం మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో బీసీలను ఓటు బాంకుగా మాత్రమే చూసారని మన అవసరాల్ని ఏ ప్రభుత్వమూ తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేసారు, వ్రుత్తులుగా విడిపోయినా బీసీ వర్గాల డీఏన్ఏ ఒకటేనని, మహాత్మా జ్యోతీబాపూలే ఎప్పుడో ఈ విషయాన్ని పరిశోదించి చెప్పారన్నారు. మనం ఎవరికీ తీసిపోమని కుల వ్రుత్తుల నుండే నేటి ఆధునిక టెక్నాలజీ ఆవిర్భవించిందన్నారు.

అలాంటి కుల వ్రత్తులకు దేశంలో ఏప్రభుత్వం చేయని విదంగా ప్రోత్సాహం ఇస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమేనన్నారు. గురుకులాలు, కళ్యాణలక్ష్మీ, స్టడీసెంటర్లు తదితర వాటి ద్వారా ఇప్పటికే 80వేల కోట్లను కేసీఆర్ సర్కార్ బీసీల కోసం ఖర్చుచేసిందన్నారు. ఈ మంచి పనిని దేశ వ్యాప్తంగా ఉన్న మన కుల సంఘాలకు తెలియజేసి, తెలంగాణ ప్రగతిని విశ్వవ్యాప్తం చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్

మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ ధ్వారా కేసీఆర్ ప్రభుత్వం 12 లక్షల కోట్లను ఖర్చు చేస్తే జనాబా దామాషాగా మన వాటాను 6 లక్షల కోట్లు అందించిందన్నారు. నేడు కోకాపేట్లో భూమి పూజ చేసుకున్న కులసంఘాలకు అభినందనలు తెలిపిన తలసాని కొద్దిరోజుల క్రితమే హెచ్ఎండీఏ వేలంలో ఒక ఎకరం 85 కోట్లు ఫలికిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పినా బీసీల కంటె బీసీ బిడ్డల కంటే ముఖ్యం ఏదీ కాదని మనకు ఈ భూమిని కేటాయించిన విషయాన్ని గుర్తుచేసారు మంత్రి తలసాని, 2014 తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పును ప్రతీ ఒక్కరూ చూస్తున్నారని దీన్ని దేశమంతా చెప్పాలన్నారు మంత్రి తలసాని.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు, నిధులిచ్చి బీసీలు ఆత్మగౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి క్రుషి చేస్తున్నారని, ఆయనకు మనమంతా అండగా నిలవాలన్నారు.

అంతకుముందు కోకాపేట లో నిర్మిస్తున్న యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను మార్చి 10 వ తేదీన ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. యాదవ, కురుమ భవనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, MLC లు ఎగ్గే మల్లేశం, బండ ప్రకాష్ ముదిరాజ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, BC సంక్షేమ శాఖ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తదితరులతో కలిసి పరిశీలించారు.. యాదవ,

కురుమ భవనాల కు ప్రహారీ గోడ, గేట్లు, ఆర్చి ల నిర్మాణం తదితర పనులకు అదనంగా 2.60 కోట్ల రూపాయలు అవసరం ఉందని అధికారులు తెలపగా, వెంటనే విడుదల చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. పనులు అన్ని ప్రారంభోత్సవం నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నిర్మాణం పూర్తి చేసుకున్న ఆత్మగౌరవ భవనాలలో యాదవ, కురుమ భవనాలు మొట్టమొదటివి అన్నారు. అనంతరం కోకాపేట ఆత్మగౌరవ సముదాయాల్లో చేపట్టవలసిన రోడ్ల నిర్మాణం, వాటర్ లైన్ వంటి పలు అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు భవనాల ప్రారంభం అనంతరం లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బండ ప్రకాష్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, టీఎస్ ఢబ్యూఐడీసీ ఛైర్మన్ రావుల శ్రీదర్ రెడ్డి, బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ ఎస్ఐ పై దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

Satyam NEWS

శ్రీ విష్ణుమూర్తి స‌మేత చెంచుల‌క్ష్మీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి

Sub Editor

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment