29.7 C
Hyderabad
May 1, 2024 06: 47 AM
Slider ముఖ్యంశాలు

భూ పోరాటాలు ఉధృతం చేయాలి: సిపిఐ

#CPI

రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు ఉధృతం చేయాలనీ సిపిఐ పార్టీ శ్రేణులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్డూమ్ భవన్ లో సిపిఐ రంగారెడ్డి జిల్లా సమితి సమావేశం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కూనంనేని సాంబశివ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ నేటికి భూమి లేని పేదలు ఎందరో ఉన్నారని వారి కోసం సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటాలు చేసి,

పేదలకు భూములను పంపిణీ చేయాలనీ కోరారు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్‌ భూదాన భూములు భూబకాసురుల ఆక్రమించుకుంటుంటే రెవిన్యూ అధికారులు ఉదాసీనత ప్రదర్శించటం శోచనీయం అని అన్నారు. నాటి నుంచి నేటి వరకు పేదల పక్షాన పోరాడుతున్న పార్టీ సీపీఐ ఒక్కటేనన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మొదలుకొని నేటి వరకు వేల ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టిన ఘనత సీపీఐకే దక్కిందన్నారు.

పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యవసర సరుకులతో పాటు డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం వేస్తుందని, అలాగే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ద్వంసం చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తోందని అయన మండిపడ్డారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించే వరకు నిరంతరంగా పోరాటాలు నిర్వహించాలని, భారత

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదని, ప్రజాస్వామ్య, లౌకికవాదులందరిని ఏకం చేసి బలమైన ఉద్యమాలు నిర్మించాలని సాంబశివ రావు కోరారు. సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ రైతుల పాలిట శాపంగా మారిందని వెంటనే ఎత్తివేయాలని, అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు, డబల్ బెడ్ రూంలు అందజేయాలని డిమాండ్‌ చేశారు.

జిల్లా లో నివేషన స్థలాలు లేని ఎందరో పేదలు ఉన్నారని వారికీ ప్రభుత్వ భూముల్లో లేదా భూదాన భూముల్లో ఇండ్ల పట్టాలివ్వాలని కోరారు. రంగారెడ్డి జిల్లా లో ఏర్పాటైన ఇండిస్టియల్‌ కారిడార్‌ లలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పాల్మాకుల జంగయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రవీంద్ర చారి, సిపిఐ రాష్ట్ర సభ్యులు పానుగంటి పర్వతాలు, ఓరుగంటి యాదయ్య, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల. యది రెడ్డి, కే చందు కే రామస్వామి, సామిడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలు పంపిణీ

Bhavani

భారత ఆర్మీకి త్వరలోనే ప్రత్యేక ఆడియో పాట

Sub Editor

వరద నీటిలోనే హస్తిన

Bhavani

Leave a Comment