29.2 C
Hyderabad
October 13, 2024 15: 10 PM
Slider ప్రత్యేకం

కరప్షన్ స్పెషల్: అంతా ఇంతా కాదు దొరికింది రెండు వేల కోట్లు

chandrababu PA 23

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ శాఖ భారీ కుంభకోణం బయటపెట్టింది. లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో సోదాలు చేసినట్లు ఐటీ అధికారులు అధికారికంగా ధృవీకరించారు.

అనధికారికంగా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సత్యం న్యూస్ వీక్షకులకు అందించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలలో 40కి పైగా ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు తెలిపారు. ఓ కీలక నేత మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్‌ నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటి శాఖ అధికారికంగా ప్రకటించింది.

బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్‌, బోగస్‌ బిల్లులు ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. దాడుల్లో బయటపడ్డ వివరాలను ఐటీ అధికారులు బయటపెట్టారు. వాట్సప్‌ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌, లెక్కచూపని విదేశీ  లావాదేవీలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు బోగస్‌ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టులను ఇచ్చిన విషయాన్ని కూడా ఐటి అధికారులు ధృవీకరించారు. (సత్యం న్యూస్ ఒక్కటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందించింది)

ట్యాక్స్‌ ఆడిట్‌ను తప్పించుకోవడానికి రూ.2 కోట్లకన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న కంపెనీలను అక్రమార్కులు సృష్టించినట్లు ఐటి సోదాలలో తేలింది. షెల్‌ కంపెనీలకు అసలు ఓనర్లు ప్రధాన కాంట్రాక్టర్లే అని ఐటీ అధికారులు అంటున్నారు. అసలు కంపెనీలు, షెల్‌ కంపెనీల ఐటీ రిటర్నులను ఒకే ఐపీ అడ్రస్‌తో ఫైల్ చేసినట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.2వేల కోట్లకు పైగా అక్రమాల గుర్తింపు జరిపినట్లు ఐటి శాఖ తెలిపింది. లెక్కచూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలు సీజ్‌ చేసినట్లు ఐటి శాఖ తెలిపారు. 25 బ్యాంక్‌ లాకర్లను ఐటీ అధికారులు సీజ్‌ చేశారు.

Related posts

అన్మాస్ పల్లి గ్రామంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

Satyam NEWS

[Over|The|Counter] Penies Enlargement Caferjack Injectible Male Enhancement How Long Do Male Enhancement Pills Stay In Your System

Bhavani

తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ

Satyam NEWS

Leave a Comment