25.2 C
Hyderabad
October 15, 2024 11: 09 AM
Slider నిజామాబాద్

ప్లీజ్ హెల్ప్: వింత వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి

help him

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని బాలరాజు, లక్ష్మిలకు ఇద్దరు సంతానం. అందులో రాజంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బాలకృష్ణ కు ఇటీవల జబ్బు చేసింది. చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ జబ్బు వైద్యులకు అర్థం కాలేదు.

దాంతో ఆ బాలుడిని హైదరాబాద్ లోని విన్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతనికి ఎస్.జే.ఎస్ జబ్బుగా గుర్తించారు. కానీ అది TENS గా వైద్యులు గుర్తించి వ్యాధి గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. చికిత్సకు సుమారుగా నాలుగు లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలుపగా కుటుంబ సబ్యులు ఖంగారు పడ్డారు.

అసలే పేదరికంలో మగ్గుతున్న కుటుంబం కావడంతో ఆపన్న హస్తం కోసం ఆర్థిస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విరాళాల కోసం తిరుగుతున్నారు. స్పందించిన దాతలు సుమారు లక్షన్నర వరకు విరాళాలు అందజేశారు. ఆ మొత్తాన్ని నేడు పాఠశాల ఉపాధ్యాయులు హైదరాబాద్ లోని విన్ హాస్పిటల్ కి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు.

చదువులో ముందంజలో ఉండే తమ కుమారుడికి ఇలాంటి జబ్బు చేయడం ఏంటని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. చికిత్సల కోసం మరో మూడు లక్షల వరకు ఖర్చు కానుందని దాతలు స్పందించి ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతున్నారు. విరాళాలు అందించాల్సిన దాతలు ఎస్ బి ఐ బ్యాంక్ a/c నంబర్ 62371358701 IFSC కోడ్ 0020503 కి పంపవలసిందిగా కోరుతున్నారు. నేడు ఆస్పత్రికి వెళ్లిన ఉపాధ్యాయులతో నాకు స్కూల్ కి రావాలని ఉంది సార్ అని అతడు విలపించాడు. చదువులో ముందంజలో ఉన్న ఆ విద్యార్థి కొలుకోవడానికి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని సత్యం న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

Related posts

క్ష‌త్రియుల స‌హ‌కారంతో న‌గ‌రంలో అల్లూరి విగ్ర‌హం ఏర్పాటు

Satyam NEWS

జీవన విధానంలో స్వచ్ఛత మౌలిక సూత్రం

Bhavani

మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment