31.7 C
Hyderabad
May 2, 2024 08: 33 AM
Slider ముఖ్యంశాలు

నిరుద్యోగ యువతను మోసం చేసిందీ జగన్ ప్రభుత్వం

విజయనగరం కలెక్టరేట్ ముందు తెలుగుయువత నాయకులు నిరసన తెలియజేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధికి కార్పోరేషన్ల ద్వారా రుణాలివ్వాలని, బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,జిల్లాలో పారిశ్రామిక క్యారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ సూర్యకుమారి వినతి పత్రం ఇచ్చారు.అనంతరం కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద తెలుగు యువత బ్యానర్ తో ధర్నా కు దిగింది. ఈ సందర్భంగాతెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షులు వేమలి చైతన్య బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోగిరి పైడిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు గంటా రవి లు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువత దారుణంగా మోసపోయారని ధ్వజమెత్తారు.

యువత కి ఆసరాగా ఉన్న నిరుద్యోగ భృతి రద్దుతో పాటు కనీసం ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ జిల్లా కేంద్రంలో , పట్టణాల్లో లక్షలాది మంది యువత గత మూడున్నర ఏళ్లుగా శిక్షణలో ఉంటూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ, ఉద్యోగాల భర్తీ ఎప్పుడా అని మనోవేదన అనుభవిస్తున్నారని అన్నారు.

పారిశ్రామిక రంగంలో కూడా ఉపాధి అవకాశాలు లేవని, కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, ఉన్నవాటిని తరమడంతో యువత రోడ్డున పడ్డారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో బలహీనవర్గాల కుటుంబాలకు ఉపయోగపడిన కార్పొరేషన్ లోన్లు కూడా నిలిపివేశారని అన్నారు.ఈ ధర్నా లో పట్టణ అధ్యక్షులు మతా బుజ్జి, పార్లమెంట్ అధికార ప్రతినిధి చిప్పాడ స్వామి, పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శులు పాలూరి రాజు నాయుడు, కర్రోతు పైడిరాజు, బమ్మిడి లక్ష్మణ, కాళ్ళ రాజశేఖర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాయపాటి సంతోష్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి పీతల కోందండరాం, నియోజకవర్గ కమిటీ సభ్యులు మద్దిల ప్రవీణ్, రొంగలి సతీష్.రా జేష్, బంగార్రాజు, పట్టణ కమిటీ సభ్యులు భాను ప్రసాద్, ఇమ్రాన్, బాబ్జీ, రవి కుమార్, శంకర్, వినయ్ కూడా పాల్గొన్నారు.

Related posts

బడ్జెట్ స్టోరీ: గ్రోతూ లేదు రూటూ లేదు

Satyam NEWS

నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే!

Bhavani

ఎన్టీఆర్ పేరు మార్పు పై సర్వత్రా నిరసనలు

Satyam NEWS

Leave a Comment