37.2 C
Hyderabad
April 26, 2024 19: 46 PM
Slider సంపాదకీయం

ఎన్టీఆర్ పేరు మార్పు పై సర్వత్రా నిరసనలు

#ntrhealthuniversity

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అమాంతం మార్చడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీకార రాజకీయాలకు పరాకాష్టగా పలువురు భావిస్తున్నారు. ఇంత కాలం ఆయన సాగించిన పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఆకస్మిక నిర్ణయంపై మాత్రం పూర్తి ఏకాభిప్రాయంతో వ్యతిరేకత వ్యక్తం అయింది. కొత్త సంస్థలు ఏర్పాటు చేసి తన పేరుగానీ, తన తండ్రి పేరుగానీ పెట్టుకుంటే చాలా మందికి అభ్యంతరం ఉండేది కాదు. కొత్త సంస్థ కాబట్టి పేరు పెట్టుకున్నారని అందరూ అనుకునేవారు.

అయితే పగబట్టినట్లుగా ఉన్న సంస్థల పేర్లు మార్చడం అత్యంత దారుణమైన వ్యవహారమని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ పేరు పైకి మార్చడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం ఉన్నవారు కూడా జగన్ ఈ నిర్ణయాన్ని సమర్ధించలేకపోతున్నారు.

యార్లగడ్డ షాకింగ్ నిర్ణయం

జగన్ తీసుకున్న నిర్ణయాలలో ఇంత వ్యతిరేకత వచ్చిన నిర్ణయం మరొకటి లేదు. చంద్రబాబునాయుడి బద్ధ వ్యతిరేకులైన వారు కూడా ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్టీ కే చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తన పదవులకు రాజీనామా చేయడం జగన్ నిర్ణయానికి ఎదురుదెబ్బగా భావించవచ్చు.

ఒక నామినేటెడ్ పోస్టు చైర్మన్ రాజీనామా చేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ జగన్ ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి రాజీనామా చేయడమే ఇక్కడ గమనార్హం. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బద్ధ వ్యతిరేకి. చంద్రబాబు ఉనికిని కూడా ఆయన సహించలేరు. అలాంటి వ్యక్తి కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారంటే ఈ పేరు మార్పు నిర్ణయానికి ఎంతటి వ్యతిరేక భావనలు రేకెత్తాయో అర్ధం చేసుకోవచ్చు.

అదే విధంగా తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి అనధికారికంగా ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశి కూడా జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే ధిక్కార స్వరంతో కాకుండా బతిమిలాడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు పలు సందర్భాలలో స్పష్టం అయినా కూడా సంబంధిత కులం వారు ఏం మాట్లాడలేదు.

మౌనంగా ఉండిపోతున్న కమ్మ కులస్తులు

అసెంబ్లీ సమావేశాలలో కమ్మ కులం పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా తీవ్ర విమర్శలు చేసినా కూడా వారు ఏం మాట్లాడలేక పోయారు. రాష్ట్రంలో పలు చోట్ల వ్యాపారాలు ఉండటం, సంఖ్యాబలం పెద్దగా లేకపోవడంతో కమ్మ కులం వారు మౌనంగా ఉండిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ మాత్రం విమర్శించినా పోలీసు కేసులు ఎదుర్కొవాల్సి వస్తుండటంతో కుల పరంగా తిడుతున్నా వారు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో ఒక్క సారిగా కమ్మ కులస్తులలో కూడా తిరుగుబాటు ధోరణి కనిపిస్తున్నది. ఇప్పటికైనా తాము నోరు మెదపకుంటే ఇంకో రెండేళ్లలో తమ కులం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందనే భావనకు వారు వచ్చారు. ఇలా ఒక కులాన్ని టార్గెట్ చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వారు వాపోతున్నారు. నగ్నంగా వీడియో కాల్ చేసిన వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ నేరుగా కమ్మ వాళ్లను ఇక్కడ రాయలేని భాషలో తిట్టారు. దానికి కమ్మ కులం వారు అక్కడక్కడా ప్రతిఘటన వ్యక్తం చేసినా ఎవరూ ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు వారి మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందనే ఆవేదనలోకి వారు వచ్చేశారు.

ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రంలోని కమ్మ కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి తమ మనుగడను కాపాడుకోవాలని అనుకుంటున్నారు

Related posts

వాజ్ పేయి జయంతి సందర్భంగా ఘన నివాళి

Satyam NEWS

నటుడు శివాజీపై లుకౌట్ నోటీసులు తొలగింపు

Satyam NEWS

మత మార్పిడి కోసం కాదు.. మనుషులను మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు

Satyam NEWS

Leave a Comment