36.2 C
Hyderabad
May 15, 2024 19: 09 PM
Slider గుంటూరు

ప్రజా సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి జగన్ పాలించే అర్హత కోల్పోయారు

#chadalawada

ప్రజా సంక్షేమం మరచి అక్రమ ధనార్జనే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను పాలించే అర్హత కోల్పోయారని గుంటూరుజిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, చెత్తపన్ను పై రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.

ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిలా వ్యవహరించడం లేదని వైస్సార్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందించకపోగా కరోనా సంక్షోభం నుండి ఇప్పుడే కోలుకుంటున్న గ్రామస్తుల పై అక్రమంగా విద్యుత్ చార్జీలను పెంచడమే కాకుండా అక్రమంగా చెత్త పన్నును విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇన్నాళ్ళలో ఇటువంటి రాక్షస పాలనను చూడలేదని ప్రజలు డా॥చదలవాడకు వివరించి వాపోయారు. నరసరావుపేట నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలో మద్యం బెల్టు షాపులు, అక్రమ గుట్కా, పేకాట వ్యాపారాలు చురుగ్గా జరుగుతున్నాయని ఎవరైనా సమాచారమిస్తే వారి పైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణ పరిధిలో కల్తీ వ్యాపారులకు, కల్తీ ఆహార పదార్థాలు, క్రికెట్ బెట్టింగులు, అక్రమ రేషన్ బియ్యం, కల్తీ పాల వ్యాపారాలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసైగల్లో నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో జగన్ నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమ ధనార్జనకు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్దిచెప్పి టీడీపీ పాలనను ఆదరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మెట్టు వేంకటేశ్వర్ రెడ్డి, యంపాటి అంజి రెడ్డి, మెట్టు శివరామిరెడ్డి, ఈదర నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు వెన్న బలకోటి రెడ్డి, పల్లెల గోవింద్ రెడ్డి, గాడిపర్తి సురేష్, మడినేది అంజయ్య, మందలపు వెంకట్ రత్నం, చిరుమామిళ్ల బ్రహ్మయ్య, కోనేటి శ్రీనివాసరావు, వడ్లమూడి శివరమయ్యా ,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాషా నియోజకవర్గ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము,కొల్లి బ్రహ్మయ్య,బొడ్డపాటి పెరయ్య, అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు,తెలుగు యువత నాయకులు మెడబలిమి నవీన్, శాఖమురి మారుతి,నాగుర్,కురపాటి శ్రీనివాస్ రావు,మబు,పెరికాల రాయప్ప,హుస్సేన్,బంగారం మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు   పాల్గొన్నారు.

Related posts

యూపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరు.. సర్వే

Sub Editor

తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Bhavani

వివిధ కారణాలతో స్వల్పంగా పెరిగిన నేరాల శాతం

Satyam NEWS

Leave a Comment