33.2 C
Hyderabad
May 15, 2024 19: 18 PM
Slider కృష్ణ

జగనన్నే మా భవిష్యత్ – మా నమ్మకం నువ్వే జగనన్న

#Jagananne Ma Bhagyu-Ma Pravinnu Nuvve Jagananna

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో జగనన్నే మా భవిష్యత్తు-మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండల వ్యాప్తంగా ఉన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, ముందుగా భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక నాయకులతో కలసి గృహసారథుల కిట్లను, వాల్ పోస్టర్లను, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఈ సందర్భంగా కృష్ణప్రసాదు మాట్లాడుతూ కుల,మత,వర్గ, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వీటిని అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమన్నారు. కరోన సమయంలో కూడా ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవలు అందించారని అన్నారు. ఇదే క్రమంలో పార్టీని వారికి అనుసంధానం చేసేందుకు, సచివాలయ కన్వీనర్లను, గృహసారథులను నియమించామన్నారు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు

. గృహసారథులు, కన్వీనర్లు ప్రతి ఇంటికీ వెళ్తూ, కిట్లలో ఉన్న స్టిక్కర్లు వారి డోర్లకు వారి అనుమతితో అతికించాలన్నారు. గత ప్రభుత్వం చేసిన మోసం గురించి, ఇప్పుడు జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించాలన్నారు. ప్రజల మద్దతు పుస్తకం ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్నారు. ఆ తర్వాత 82960 82960 కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. ప్రతి తలుపు తట్టి పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెల్యే

Satyam NEWS

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS

దళితులను అణచివేస్తున్న దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది

Satyam NEWS

Leave a Comment