జగిత్యాలజిల్లాలో రోజు రోజుకు కుటుంబ కలహాలు ఎక్కువవుతున్నాయి.నిన్న జిల్లాలోని రాయికల్ లో భార్యను గొడ్డలి తో దాడి చేసి పారిపోయి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నసంఘటన మరువకముందే కుటుంబ కలహాలతో భార్యపై నే కాల్పులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో భార్యను హత్య చేసేందుకు భర్త తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది.
మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన ప్యాట శ్రీనివాస్ మరో వ్యక్తితో కలిసే వచ్చి భార్యతో గొడవకు దిగాడు.శ్రీనివాస్‌కు అతని భార్య గీతికకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో కొద్ది రోజులుగా గీతిక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్రాజ్‌పల్లిలోని మేనమామ ఇంట్లో తల దాచుకుంటుంది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన శ్రీనివాస్ గొడవకు దిగాడు. తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు.ఈ క్రమంలో అడ్డువచ్చిన రాజిరెడ్డికి బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన రాజిరెడ్డిని జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు.