40.2 C
Hyderabad
April 29, 2024 15: 54 PM
Slider మహబూబ్ నగర్

దేశంలోని మహిళలకు పెద్దన్నలా నిలిచిన నరేంద్రమోడీ

kolla bjp

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఏమయ్యారని?ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చల్లగా డ్రామా ఆడుతున్నారని కేసీఆర్ కుటుంబ పాలనను అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షుడు డా లక్ష్మణ్ అన్నారు. బుధవారం కొల్లాపూర్ పురపాలక ప్రాంతంలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అధ్యక్షతన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కుమారి బంగారు శృతి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొని చుక్కాయి పల్లి కొల్లాపూర్ పురవీధుల గుండా మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు.

ముందుగా కొల్లాపూర్ పట్టణం మాహాత్మా గాంధీ హైస్కూల్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా లో  సభ వేదిక వరకు సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలను విధానాలను  కొనసాగించడానికి  గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభమైందన్నారు. 50 ఏళ్లు  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి  కుటుంబ పాలన చేసిందన్నారు. స్వలాభం కోసం స్వార్థాలకు పాల్పడ్డారన్నారు. గాంధీ పేరును అడ్డుపెట్టుకుని  50 ఏళ్లు పాలించారన్నారు.

మొదటగా ముగ్గురు ఎంపీలతో బీజేపీ పార్టీ మొదలై ముపై ఏండ్ల తర్వాత  నేడు  300  పైగా  ఎంపీ స్థానాల్లో బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్రంలో  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కృష్ణార్జునుల పాత్ర వహిస్తున్నారన్నారు. దేశాన్ని అభివృద్ధి లో నడిపిస్తున్నారన్నారు.  మహిళల కోసం 7 కోట్ల  మరుగుదొడ్లు నిర్మించి దేశ మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ పెద్దన్న పాత్ర పోషించారన్నారు. కేంద్ర సంక్షేమ లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ సంక్షేమాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. రైతుల కోసం కిసాన్ పథకం ప్రవేశపెట్టి రైతులకు బాసటగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన చిన్నతనంలో తన తల్లి పడిన కష్టాన్ని  చూసి ఆ కష్టం ఏ తల్లి పడవద్దని దేశ ప్రజలకు  ఉజ్వల యోజన గ్యాస్ పథకం ప్రవేశ పెట్టారన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి కి పట్టడం లేదన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు బీజేపీ పార్టీకి చైర్మన్ అవకాశం ఇచ్చారంటే నేరుగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలను ప్రజలకు అందే విధంగా అందిస్తారన్నారు.

అంతకుముందు ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడారు.20 ఏళ్ల కొల్లాపూర్  నియోజకవర్గానికి శని పట్టుకుంటే ఇప్పుడు దరిద్రం పట్టుకుందన్నారు. దరిద్రం వెంటాడుతుందన్నారు. జాతీయ రహదారి సాధన కేంద్ర ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందన్నారు. ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో 20 వార్డుల్లో బీజేపీ పార్టీని గెలిపించాలన్నారు. కుమారి బంగారు శ్రుతి మాట్లాడారు. జాతీయ రహదారి సాధించి తీరుతాం అన్నారు.

Related posts

‘శివాoశు’ను హీరోగా పరిచయం చేస్తూ ఆర్.వి.జీ ప్రొడక్షన్-3 ప్రారంభం

Satyam NEWS

హమ్మయ్య చిరుతపులి అడవిలోకి వెళ్లిపోయింది

Satyam NEWS

సీతారాముల కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

Satyam NEWS

Leave a Comment