27.3 C
Hyderabad
May 10, 2024 10: 26 AM
Slider ఖమ్మం

మున్నేరు పైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు లైన్ క్లియర్..

#kcr

ఖమ్మం నగరాభివృద్ది లో భాగంగా నగరం విస్తరించిన తరుణంలో ప్రజా రవాణా ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే నగరంలో నాయబజార్ వద్ద మున్నేరు పై బ్రిటిష్ కాలం నాటి వంతెన కు ప్రత్యామ్నాయంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు నూతన తీగల వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.

గత సంవత్సరాల ఆగస్టు నెలలో ఇక్కడ నూతన బ్రిడ్జి నిర్మించాలనే ఉద్దేశంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టి కి తీసుకెళ్లారు. తరచూ ట్రాఫిక్ జామ్ లు, రోడ్డు వెడల్పు తక్కువ ఉన్న కారణంగా ప్రమాదాలు, వర్షాకాలంలో వరద ఉధృతికి మున్నేరు బ్రిడ్జి ప్రమాదకరమా మారడం ఇలా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనల దృష్ట్యా నూతన బ్రిడ్జి నిర్మించాలని మంత్రి పువ్వాడ ప్రతిపాదించారు.

నిన్న ఖమ్మం భహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్ మంత్రి పువ్వాడ విజ్ఞప్తిని గుర్తు చేసుకుని, మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రకటించిందే తడువుగా మంత్రి స్వయంగా దగ్గరుండి నేడు పరిపాలనా ఉత్తరువులు మంజూరు చేయించారు.సుదీర్ఘ కాలంగా ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న మున్నెరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో లైన్ క్లియర్ కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొత్తం బ్రిడ్జి 420 మీటర్ల పొడవు ఉండగా 300 మీటర్లు కేబుల్ పై నిలువగా 120 మీటర్లు RCC పై ఉండనుంది. నిర్మాణం పూర్తి అయితే ప్రజా రవాణా కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.

హైదరాబాద్ దుర్గం చెరువు పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తరహాలో ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఅర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి నగర ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

హుజూర్ నగర్ నూతన టి ఎన్ జి వో యూనిట్ ఎన్నిక

Satyam NEWS

సినీ దర్శకుడు మదన్ హఠాన్మరణం!!

Satyam NEWS

మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

Bhavani

Leave a Comment