28.7 C
Hyderabad
May 6, 2024 07: 27 AM
Slider నిజామాబాద్

నీటి పరీక్షల అనంతరమే మిషన్ భగీరథ కు కేంద్రం నిధులు

మిషన్ భగీరథ నీటి నాణ్యత పరీక్షించిన తర్వాతే జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతాయని బృందసభ్యుడు రవీందర్ తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధ నీరు సక్రమంగా సరఫరా అవుతున్న విషయం పైకేంద్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ, మిషన్ భగీరథ అధికార బృందం బుధవారం జుక్కల్ నియోజకవర్గం లో పర్యటించింది.బిచ్కుంద, జుక్కల్ మండలం గుండూర్, నిజాంసాగర్ మండలం తెల్గాపూర్ గ్రామాలలో అధికారులు పరిశీలన జరిపారు. నీటి కుళాయిలు, నీటి ట్యాంక్ లు నుంచి నీటి ని సేకరించి ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేందుకు విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులను కేటాయించడం జరుగుతుందని కమిటీ బృందసభ్యుడు రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మిషన్ భగీరథ డిప్యుటీ ఇ ఇ కౌశిక్ రెడ్డి, డిప్యుటీ అర్వింద్, ఏ ఇ హరీష్, నయీమ్, రాచప్ప, బిచ్కుంద గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్,బిల్ కాలెక్టర్ కిష్టారెడ్డి, కారోబారి మహేష్, వీరేషం,సిబ్బంది పాల్గొన్నారు.

జీ.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్

Related posts

సెలబ్రిటీస్ అందరి దృష్టి ఇప్పుడు బ్రాండ్ మందిర్ పైనే

Satyam NEWS

కొల్లాపూర్ పట్టణ చరిత్రను చెరిపేస్తున్నది ఎవరు?

Satyam NEWS

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం లో “పదనిసలు”

Satyam NEWS

Leave a Comment