37.2 C
Hyderabad
May 1, 2024 11: 20 AM
Slider ఆధ్యాత్మికం

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం లో “పదనిసలు”

#vijaya

ఉత్తరాంధ్ర ఇలవేల్పు ,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబురం వైభవోపేతంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని దాదాపు 3 లక్షల మంది భక్తులు వచ్చి తిలకించారు. ఈ సిరిమానోత్సవంలో పలు అంశాలు విశేషాలై “పదనిసలు” మారాయంటోంది సత్యం న్యూస్. నెట్.అవేంటంటే….!

సిరిమాను ఉత్సవంలో ముందు రోజే స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆ మర్నాడు మంగళవారం కేంద్ర మాజీ మంత్రి అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు.

ఈ ఏడు జరిగిన సిరిమాను సంబంరంలో వీవీఐపీలు తక్కువ మందే అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ ఏడాది అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని అమ్మవారిని దర్శించుకోలేదు.

ఈ సారి ఉత్సవానికి ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ ముఖ్య అతధిగా హాజరయ్యారు.

వరుసగా మూడోసారి జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ దీపికా ఆధ్వర్యంలో సిరిమాను తిరిగింది.

ఇక సరికొత్త పద్ధతి లో సిరిమాను ఉత్సవానికి మూడు షిఫ్ట్ లలో బందోబస్తు ఇచ్చారు.

అలాగే ఈ ఏడు అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ వచ్చి దర్శించుకున్నారు. ఇక పోలీసు కంట్రోల్ రూమ్ ను కొత్త బిల్డింగ్ లోకి అదీ మొదటి అంతస్థులో పెట్టారు.

దాదాపు 80 సీసీ కెమెరాల తో డేగ కళ్ళ తో పటిష్టమైన బందోబస్తు చేశారు.

ఈ సారి సిరిమాను తిరిగే సమయంలో స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేసిన టీ షర్ట్ లు వేసుకుని…. పెద్ద సంఖ్యలో అనుయాయులు కనిపించారు.

అలాగే ప్రతీ ఏడాది సిరిమాను తిరిగే సమయంలో వర్షం పడేది…కానీ ఈ సారి కనీసం ఆకాశం మేఘావృతం కూడా అవ్వలేదు.

ఇక సిరిమానను హుకుం పేట నుంచీ తీసుకువచ్చే క్రమంలో మధ్యాహ్నం.02.40కి వచ్చినా..రెండు గంటల తర్వాత షురూ అయ్యింది.

సిరిమాను కట్టే సమయంలో రెండు సార్లు కట్టబోయే తాడు తెగిపోవడం జరిగింది.

సిరిమానోత్సవం తిలకించేందుకు… నాలుగు గంటలకే డీసీసీబీ వద్దకు మంత్రి బొత్స తదితరులు వచ్చి కూర్చున్నారు.

ముఖ్య అతిథులు కూర్చున్న తర్వాత… కోట వద్ద నుంచీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, కలెక్టర్ నాగలక్ష్మి టెంపుల్ కు వచ్చారు.

ఇక ఆద్యంతం జిల్లా ఎస్పీ దీపికా… కంట్రోల్ రూమ్ వద్దే ఉంటూ భద్రత ను పర్యవేక్షించారు.

సిరిమాను ప్రారంభోత్సవానికి ముందే నకిలీ ఐడీ కార్డులు వేసుకుని తిరిగుతున్న వ్యక్తులను వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు గుర్తించారు.

ఈ సిరిమాను ఉత్సవంలో ఇద్దరు పిల్లలు అదృశ్యం అవడం మళ్ళీ దొరకడంతో జరిగింది.

కోవెలకు సిరిమాను ముందొచ్చినప్పటికీ..దానిపై పూజారి ఆసీనులవ్వడం దాదాపు రెండు గంటలు పట్టడం విశేషం.

ఇంతవరకు బొట్టు పెట్టని జిల్లా ఎస్పీ ఈ సారి పెద్దబొట్టు పెట్టుకుని.  సిరిమాను తిరిగే సమయ కనిపించారు.

సమాచార ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో టెంపుల్ కు దగ్గర లోనే మీడియా టిఫిన్, బోజనాలు ఏర్పాటు చేశారు.

ఇక చివరి లో డోలా మన్మధకుమార్ ఆధ్వర్యంలో కోట వద్ద పులివేషాలు ప్రదర్శన కడువైభవంగా జరిగాయి.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్, విజయనగరం జిల్లా

Related posts

జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

మద్యం అమ్మకాల వల్లే పెరుగుతున్న కరోనా

Satyam NEWS

తెలంగాణ రాష్ట్రం లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Bhavani

Leave a Comment