40.2 C
Hyderabad
May 6, 2024 17: 37 PM
Slider ప్రత్యేకం

‘ఊరు ఊరుకి జమ్మి చెట్టు’ గొప్ప కార్యక్రమం

#kvramanachari

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాష్ట్రంలోని ‘గుడిగుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమం చాలా గొప్పదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు.

హైదరాబాద్ లోని మాసాబ్‌ట్యాంక్‌ ఏసీగార్డ్స్‌లోని క్యాంపు కార్యాలయంలో రమణాచారి అర్చకులకు జమ్మి మొక్కలు అందజేశారు. తెలంగాణ దేవాదాయ అర్చక ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ రవీంద్రాచార్యులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.

అర్హులైన అర్చక ఉద్యోగులకు ఆర్థికంగా తోడ్పాటుతోపాటు హెల్త్‌కార్డులు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ. 144 కోట్లు సంక్షేమ పరిషత్‌లో ఉన్నాయంటూ దసరా ఉత్సవాల సందర్భంగా దేవాలయాల్లో జమ్మి మొక్క నాటి పవిత్రతను, విజయ సంకేతాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కృష్ణవేణి, బల్కంపేట ఆలయ ఈవో అన్నపూర్ణ, సమితి గౌరవ అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యులు, ప్రధాన కార్యదర్శి మాదారం యాదిగిరి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కొండూరి కృష్ణమాచారి, అడ్‌హక్‌ కమిటీ గ్రేటర్‌ అధ్యక్షుడు గంగు సత్యం, జగపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కైకాల‌కు మెగా బ్ర‌ద‌ర్స్ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు

Satyam NEWS

షేమ్ ఆన్ యు: మంత్రి సమావేశంలో లో పాత్రికేయుల పాట్లు

Satyam NEWS

నువ్వు బతికి ఉన్నావా? ఆధారం ఏమిటి?

Satyam NEWS

Leave a Comment