42.2 C
Hyderabad
April 30, 2024 16: 04 PM
Slider సినిమా

కైకాల‌కు మెగా బ్ర‌ద‌ర్స్ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు

#Kaikala Satyanaraya

న‌వ‌ర‌స న‌టసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ పుట్టిన‌రోజు నేడు. న‌టుడుగా గ‌త ఏడాది ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా `భ‌క్త ప్ర‌హ్లాద` విడుద‌ల అయితే..1935 జులై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. 1959లో ఆయ‌న న‌టించిన `సిపాయి కూతురు` విడుద‌లైంది. ఇప్ప‌టికి న‌టుడిగా 61 సంవ‌త్స‌రాలు కాగా.. వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది జులై 20కి 85 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది.

నేడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేరు పేరునా వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌మ్ముళ్లు చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు ప్ర‌త్యేకించి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారని కైకాల‌ వెల్ల‌డించారు. వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న బందుమిత్రులు, కుటుంబ స‌భ్యులు స‌హా అభిమానుల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Related posts

వీడియో తీయడానికి నువ్వెవడివిరా

Satyam NEWS

రుజువులు ఎక్కడ తేను

Satyam NEWS

క్లిక్ & కలెక్ట్’ సేవలను ప్రారంభించిన హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF)

Satyam NEWS

Leave a Comment