42.2 C
Hyderabad
April 26, 2024 15: 46 PM
Slider ఖమ్మం

పార్లమెంటులో వ్యవసాయ బిల్లు దుర్మార్గం

#RenukaChowdary

దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల వశం చేసేందుకు బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం ద్వారా దుర్మార్గమైన చర్య కు పాల్పడిందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేట్ శక్తుల కోసం వ్యవసాయ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్ట డాన్ని నిరసిస్తూ రేణుకా చౌదరి సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో వ్యవసాయ బిల్లు ను ప్రవేశ పెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. బిల్లును తీవ్రంగా ఖండించారు.

ఇది రైతుల ను  అమ్మేసే దోపిడీ విధానంగా ఆరోపించారు. అందరి ఆస్తులు తాకట్టు పెట్టుకునే దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. భూమికి రైతుకు ఉన్న సంబంధం ఏమిటో ప్రధాని నరేంద్ర మోడీకి తెలియక పోవడం విచారకరమన్నారు. చాయ్ వాలా గా అనుభవం కల్గిన మోడీ దేశాన్ని బాగు చేస్తారని అనుకు ని చేతిలో దేశాన్ని పెడితే వ్యవసాయ బిల్లు తో నాశనం చేశారని మండిపడ్డారు.

ఇది రైతు అత్మ హత్యలకు దారి తీస్తుందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు రైతులు ఊడిగం చేసే చర్యగా నిప్పులు చెరిగారు. రాష్ట్రాలను సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా కార్పొరేట్ శక్తుల కోసం వ్యవసాయ బిల్లు పెట్టడం ఏమిటని మండిపడ్డారు.

 రాష్ట్రాల సబ్జెక్టుపై రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య దేశంలో తగదన్నారు. ఇప్పటికే జీఎస్టీ పేరుతో రాష్ట్రాలకు తీరని ద్రోహం చేసిన కేంద్రం వ్యవసాయ బిల్లుతో మరింత దుర్మార్గానికి ఒడిగ ట్టిందని మండిపడ్డారు.

దేశంలో  రైతులకు దిక్కులేకుండా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చిన్న సన్నకారు రైతుల పై వ్యవసాయ బిల్లు ద్వారా దెబ్బ పడుతుందన్నారు. అన్నం పెట్టే రైతన్న కు సున్నం పెట్టే చర్యలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయని రేణుకా చౌదరి హెచ్చరించారు.

Related posts

ములుగు శ్రీ క్షేత్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పూజలు

Satyam NEWS

ఎన్.ఎల్.పి. మాస్టర్ ట్రైనర్ గా రోహిత్ కుమార్

Satyam NEWS

కొడంగల్ లో ఆటో యూనియన్ ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS

Leave a Comment