25.7 C
Hyderabad
May 9, 2024 07: 10 AM
Slider ఖమ్మం

పదవ తేదీ నుంచి జన సేవాదళ్ శిక్షణా శిబిరం

#CPI

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనుబంధ జన సేవాదళ్ జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం సెప్టెంబరు 10 నుండి 18వ తేదీ వరకు ఖమ్మంలో జరగనుంది. జన సేవాదళ్ శిక్షణా శిబిరానికి దేశంలోనే 20 రాష్ట్రాల నుంచి యువకులు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి సన్నాహాక సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది.

పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సన్నాహాక సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఆ తర్వాత జన సేవాదళ్ ప్రజా సమస్యల పరిష్కారం. ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో నిలిచిందన్నారు.

ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు జనసేవా దళ్కు సంబంధించిన శిక్షణను 10 రోజుల పాటు నిర్వహించనున్నామని హేమంతరావు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఈ సన్నాహాక సమావేశంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జన సేవాదళ్ బాధ్యులు సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపదలో ఉన్నప్పుడు నిస్సందేహంగా డయల్ 100

Satyam NEWS

తాళంవేత అనంతరం

Satyam NEWS

విజయవాడలో హవాలా సొమ్ము హల్ చల్

Satyam NEWS

Leave a Comment