30.2 C
Hyderabad
September 14, 2024 17: 03 PM
Slider కడప

పారిశుద్ధ్య కార్మికులకు అండగా జనసేన

#rajempet

రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట మున్సిపల్ కార్మికుల సమ్మె దీక్షకు రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల న్యాయబద్ధమైన జీతం పెంచడం వారి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయడం ప్రభుత్వం బాధ్యత అని తెలియజేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పక ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.అదేవిధంగా వారికి అధునాతన పనిముట్లు యంత్రాలు సమకూర్చి వారిని సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితం అందించాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఐదు పది సంవత్సరాలలోనే వందల వేల కోట్లకు అధిపతి అవుతున్నారు. సామాన్యుడు బతకలేని జీవితం వెల్లదీస్తున్నారు. ప్రజలలో చైతన్యం రావాలి రాజకీయ నాయకులు ప్రజా సేవకులుగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి, కత్తి సుబ్బరాయుడు, గోవర్ధన్, జనసేన వీర మహిళలు రజిత, శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్సిడెంట్:హుజూరాబాద్‌ లో ప్రమాదం 7 గురికి గాయాలు

Satyam NEWS

విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

Sub Editor

కారు వైప‌ర్ ద్వారా రాబ‌రీని చేధించిన నెల్లిమ‌ర్ల పోలీసులు…!

Satyam NEWS

Leave a Comment