29.7 C
Hyderabad
May 6, 2024 06: 20 AM
Slider కడప

పంట పరిహారం కోసం జనసేన నేత నిరసన దీక్ష

#Janasena Kadapa

నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి 10 వేల రూపాయల పరిహారం తక్షణం చెల్లించాలని కోరుతూ కడప నగరంలోని జనసేన కార్యాలయంలో కడప అసెంబ్లీ ఇంచార్జి, రాయలసీమ పార్లమెంటరీ జాయింట్ కన్వీనర్  సుంకర శ్రీనివాస్  నిరసన దీక్ష చేపట్టారు.

బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శి పనతల సురేష్  దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సంధర్భంగా సుంకర శ్రీనివాస్  మాట్లాడుతూ నివర్ తుఫాను వల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోయిందని కానీ ఇప్పటివరకు వారికి తక్షణ పరిహారం చెల్లించడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.

రైతు పక్షపాతి అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు రైతులను ఎందుకు విస్మరిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

ప్రభుత్వం మరియు కడప జిల్లా ఉన్నత అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయినటువంటి బుగ్గవంక నిర్వాసితుల అందరికీ కూడా తక్షణ సహాయంగా 20 వేల రూపాయలు ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ చెల్లించాలని,అదేవిధంగా సదరు నిర్వాసితులు వారి వారి కుటుంబంలో నష్టపోయినటువంటి ఆస్తి పరిహారం కింద ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు వస్తువులు కోల్పోయిన వారికి వస్తువులు, కోల్పోయిన స్థాయిలోనే తిరిగి ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

జనసేన, బీజేపీ నివర్ తుఫాను బాధిత కుటుంబాలు అలాగే నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు పోరాటాలు చేస్తుందన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పరిహారం చెల్లించాలని నిరసన దీక్షలు చేయాలన్న పిలుపు మేరకు దీక్షలు చేస్తున్నామన్నారు.

సీఎం సొంత జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవడం నిర్లక్ష్యం వహిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మలేశివ, ప్రధాన కార్యదర్శి గజ్జెల సాయి, కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ బాబు, లీగల్ సెల్ తోట బాల సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నాగరాజు, కార్యదర్శి సందీప్, ఉంగరాల విజయ్, సుంకర ప్రసాద్, ఈశ్వర్ రెడ్డి, మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు…

Related posts

విజ‌యం సాధించిన బీజేపీ కార్పొరేట‌ర్ల‌కు ఘ‌న స‌న్మానం

Sub Editor

గన్నవరం వైఎస్ఆర్ పార్టీలో పెరుగుతున్న గందరగోళం

Satyam NEWS

ఫైనల్: కొల్లాపూర్ లో సత్యం న్యూస్ ప్రిడిక్షన్ కరెక్ట్

Satyam NEWS

Leave a Comment