జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారికి ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇన్ని గంటల పాటు ఇంట్లో ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నవారు నాలుగు చెంచాల ఆముదం తాగాలని సలహా ఇచ్చారు. మోదీ జనతా కర్ఫ్యూకి మద్దతుగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
అందరం ప్రధాని మాట విందామని ఆ వీడియోలో పేర్కొన్న పూరి.. అలా చేస్తే కరోనా వైరస్ చైన్ కట్ అవుతుందన్నాడు. కాబట్టి పెద్దల మాటను గౌరవించి ఇంట్లోనే ఉందామన్నాడు. ఇంట్లో ఉండలేమంటూ ప్రస్టేషన్‌కు గురయ్యే వారికి తనదో సలహా అని, అలాంటి వారు నేటి ఉదయం నాలుగు స్పూన్ల ఆముదం తాగాలని సూచించాడు. అలా చేస్తే విరేచనాలు పట్టుకుని బయటకు రాలేరని వివరించాడు.