రాజంపేట ప్రాంతంలో కరోనా నియంత్రణ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఉదయం నుంచి జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అన్నీ వ్యాపార సముదాయాలు మూతపడగా, రోడ్లు, బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లు, నిర్మానుష్యంగా మారిపోయాయి.
కాగా ప్రజలు ఇండ్లలోనుంచి బయటకు రావడం లేదు. కాగా ఆదివారం కావడంతో తెల్లవారు జామున మాంసం విక్రయ కేంద్రాలు జనాల రద్దీతో కిటకిటలాడాయి. రాజంపేట పోలీసులు మైక్ ద్వారా ప్రజల్లో ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ సిబ్బంది రోడ్ల కి ఇరువైపులా బ్లీచింగ్ చల్లారు.