27.7 C
Hyderabad
May 14, 2024 05: 46 AM
Slider మహబూబ్ నగర్

ఘనంగా తెలంగాణ జాతిపిత జయశంకర్ జన్మదిన వేడుకలు

#jayashankar

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ జాతిపిత జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రొ.జయశంకర్  జయంతి వేడుకల సందర్భంగా ప్రిన్సిపాల్ సురెందర్ రెడ్డి  ఈసందర్భంగా మాట్లాడుతూ పుట్టుక నీది ,చావు నీది, బతుకంతా తెలంగాణది అంటూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జెండా ఎత్తి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది  తెలంగాణే శ్వాసగా తెలంగాణే ద్యాసగా తన జీవితాన్ని అంకితం చేసిన కల్మషం లేని నిస్వార్ద జీవి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ జాతి పిత జయశంకర్  అని కొనియాడారు. ప్రభుత్వం జయశంకర్  జయంతిని ప్రభుత్వం అధ్యాపక దినోత్సవంగా నిర్వహించాలన్నారు. జయశంకర్ ఆశయాలను నెరవేర్చేలా ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో లెక్చరర్స్ సదానందం గౌడు ,మల్లేష్, శ్రీనివాస్, పరషురాం , శాంతి కుమార్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో

తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో  ఆచార్య జయ శంకర్ జయంతిని నిర్వహిస్తూ  దారమోని గణేష్ మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు పురుడు పోసిన మార్గదర్శి, స్వరాష్ట్రం స్వప్నం కోసం తొలి అడుగు తడబడక వేసి అందరికీ దారి చూపిన దిక్సూచి, తెలంగాణ ప్రజల బతుకులు స్వరాష్ట్రంలోనే బాగుపడతాయని  ఎవరికి జడువక ఉద్యమానికి అందరినీ జాగృతం జేసిన ఓ దీవిటీ,ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ల వచ్చినప్పటికీ వాటికి బుగులు పడకుండా ధైర్యంగా తాను తన ఆశయాన్ని సాధించేందుకు వ్యక్తిగత జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మనసున్న మహానీయులు  అని కొనియాడారు .

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం కల్వకుర్తి నియోజకవర్గం కన్వీనర్ షకీల్, ఐ ఎస్ డి ఫోరం గణేష్ , యూత్ ఐకాన్అరుణ్ తేజ,జాగృతి విద్యార్థి విభాగం నాయకులు సందీప్, శరత్, పృథ్వి , రాము,శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాత బస్టాండును వినియోగoలోకి తేవాలి

Satyam NEWS

రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం

Sub Editor

Analysis: బలం ఎక్కువ బుద్ధి తక్కువ

Satyam NEWS

Leave a Comment