38.2 C
Hyderabad
April 29, 2024 14: 30 PM
Slider ప్రపంచం

Analysis: బలం ఎక్కువ బుద్ధి తక్కువ

#China Army

భారత్, చైనాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో శాంతి స్థాపన ప్రయత్నాలు మొదలైనట్లు తాజా సమాచారం. వాస్తవాధీనరేఖకు ఇరువైపులా రెండుదేశాలకు చెందిన శిబిరాలు తొలగించి సుమారు 2 కిలో మీటర్ల మేర వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది.

పర్వత సానువుల్లో వేల మంది సైనికులను, యుద్ధ సామాగ్రిని భారత్ మోహరించడం… అంతర్జాతీయంగా అమెరికాతో సహా అనేక దేశాలు భారత్ కు మద్దతు ప్రకటించడం వంటి కారణాలతో చైనా వెనక్కు తగ్గినట్లు పరిశీలకుల అంచనా. సైనిక బలగాల సంఖ్యలో భారత్, ఉత్తర కొరియాల తర్వాత స్థానంలో చైనా ఉంది.

అమెరికా,రష్యా,యూరప్ ల కంటే పటిష్టమైన, అతి పెద్ద సైనిక బలగాలు ఉన్న దేశంగా భారత్ కు స్వయంగా చైనా నిపుణులు కితాబివ్వడం విశేషం. అయితే…ఆయుధాల సమీకరణలో చైనా అత్యంత బలంగా ఉంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా వాస్తవాధీనరేఖ వద్ద సైనిక శ్రేణుల్ని చైనా నిష్క్రమించినా యుద్ధ వాతావరణం పూర్తిగా చల్లబడినట్లు కాదని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆయుధాల కొనుగోలుకు అధిక మొత్తం

ఈ నేపథ్యంలో ఇటీవల చైనా  సత్తా తెలిపే సైనికవివరాలు,రక్షణ సామాగ్రి తదితరాలు గ్లోబల్ టైమ్స్ ద్వారా  వెలుగులోకి వచ్చాయి. అనతి కాలంలోనే సూపర్ శక్తిగా  అవతరించిన  చైనా రక్షణ వ్యవస్థ బలోపేతం చేయడానికి 22 వేల 400 కోట్ల డాలర్లు బడ్జెట్ కేటాయించింది. భారత్ కేవలం 5 వేల 502 కోట్ల డాలర్లు మాత్రమే  కేటాయించింది.

చైనా వద్ద 3,187 యుద్ధ విమానాలు ఉండగా భారత్ 2092 కలిగివుంది. చైనా దేశం భారత్ కంటే అధిక సంఖ్యలో ఇంటర్ సెప్టార్స్, అటాక్ ఎయిర్ క్రాప్ట్స్,యుద్ధ ట్యాంకులు, ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికిల్స్ సమీకరించింది. చైనా నావికాబలగం 714 కాగా భారత్ వద్ద కేవలం 295 ఉన్నట్లు సమాచారం. ఇక జలాంతర్గాముల విషయం లో కూడా చైనా భారత్ ను మించిపోయింది.

చైనా వద్ద 76 జలాంతర్గాములు ఉండగా భారత్ 16 మాత్రం కలిగివుంది. ఎప్పటికైనా పొరుగు దేశాలతో ప్రమాదం పొంచి ఉందన్న వాస్తవాన్ని భారత్  గుర్తించి రష్యా, అమెరికా ….ఇతర దేశాల నుంచి భారీఎత్తున యుధాలు,యుద్ధవాహనాలు కొనుగోలు ప్రక్రియను ఆరంభించింది.

మనం కూడా బడ్జెట్ పెంచుకోవాలి

 బలమైన శత్రువును ఢీ కొనాలంటే సైనిక సిబ్బంది తో పాటు అవసర ఆయుధాలు సమీకరించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో దేశ రక్షణ కు అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని బలమైన వాదం వినిపిస్తోంది. బడ్జెట్ లో కేటాయింపులు గణనీయంగా పెంచి రక్షణ వ్యవస్థ శక్తి సామర్ధ్యాలను మరింత బలోపేతం చేయాలని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు భారత్ కు సూచించారు. సానుకూల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది శుభ పరిణామం. పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

అనధికార నిర్మాణం కూల్చివేత

Sub Editor

విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధం

Bhavani

నియంత్రిత పంటల విధానంపై తీర్మానించిన తొలి గ్రామం

Satyam NEWS

Leave a Comment