31.7 C
Hyderabad
May 6, 2024 23: 16 PM
Slider అనంతపురం

ఏపి నుంచి కార్యకలాపాలు ఉపసంహరించుకున్న జాకీ

#jockeyfactory

ప్రముఖ బనియన్లు, డ్రాయర్లు తయారు చేసే జాకీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి తన కార్యకలాపాలను ఉప సంహరించుకున్నది. తాము కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ జాకీ గ్రూప్ ప్రభుత్వాన్ని కోరింది. అప్పటిలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 60 ఎకరాల భూమిని కేటాయించింది. టీడీపీ హయాంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎపిఐఐసితో కుదుర్చుకున్న ఎంఒయును రద్దు చేయాలని కోరుతూ జాకీ ఇంటర్నేషనల్ గ్రూప్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. రాజకీయ నేతల అండర్‌హ్యాండ్ చెల్లింపుల కోసం డిమాండ్‌లు, ఒత్తిళ్ల కారణంగా నిరుత్సాహానికి గురైన కారణంగా తన ప్రాజెక్ట్‌ను వదిలివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. జాకీ కంపెనీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ కంపెనీని ప్రభుత్వం ఒప్పిస్తుందా లేక జిల్లా వదిలి వెళ్లేలా చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Related posts

పారిశుద్ద్య కార్మికులకు మంత్రి అల్లోల‌ సలాం

Satyam NEWS

ఈ స్కూల్ ను కాపాడకపోతే ప్రభుత్వమే వేస్టు

Satyam NEWS

అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Bhavani

Leave a Comment