31.2 C
Hyderabad
May 3, 2024 01: 16 AM
Slider మహబూబ్ నగర్

జొన్నలబొగుడ నీటిని విడుదల చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

jonnallagadda resarvior

◆ ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి నీటిని విడుదల చేశారు.
_◆ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
◆ కొల్లాపూర్ ప్రాంత రైతాంగానికి సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
◆ రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ పని చేస్తున్నారన్నారు.
◆ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింద‌న్నారు.
◆ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
◆ అన్ని వర్గాల సంక్షేమం కోసం వందేళ్ల ముందుచూపుతో కెసిఆర్ పాలన చేస్తున్నారని కొనియాడారు.
◆ ఏయే పంటలు, ఏయే భూముల్లో పండుతాయి? ఏయే కాలాల్లో ఏయే పంటలు వేయాలి వంటి అనేక వివరాలతో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
◆ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు పంటలు వేసి పసిడి పంటలు పండించాలని రైతులను కోరారు.
◆ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమలలో డిక్లరేషన్ విధానాన్ని ఎత్తేయాల్సిందే

Satyam NEWS

భారత భూభాగంలోకి చైనా వస్తే ఊరుకోం

Satyam NEWS

డిస్గస్టింగ్:ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment