భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ లో ఘోరం జరిగింది.క్షణికావేశం లో ఓ మహిళా తన ఇద్దరు పిల్లలతో ఆత్మ హత్యకు యత్నించింది.గుగులోత్ శిరీష అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బస్టాండ్ సిబ్బంది, స్థానికులు వెంటనే వారిని కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు.
శిరీష చిన్నకుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త మీద కోపంతో శిరీష ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శిరీష సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామవాసి కాగా పోలీస్ లు కాసే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.