Slider రంగారెడ్డి

మొక్కలు నాటిన జర్నలిస్టు సంఘాల నేతలు

kukatpally

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ ప్రాంతంలోని జర్నలిస్ట్ కాలనీ (4th ఎస్టేట్) లో కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ (TUWJ) ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం జరిగింది.

దీనికి తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత, TUWJ రాష్ట్ర కోశాధికారి మారుతి సాగర్ లు ముఖ్య అతిధిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలనే సంకల్పంతో సిఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు.

దానిలో భాగంగా పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రాం ను ముఖ్య అతిధులకు విసరగా ఇటీవల కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ (TUWJ) ఛాలెంజ్ గా తీసుకొని హరితహారం కార్యక్రమం చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు.

హరితహారం కార్యక్రమం కోసం ఒక అధికారి ని నియమించి మొక్కలు పెంపకం కోసం పాటుపడుతున్నారని, సమాజంలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రత్యేకంగా జర్నలిస్ట్ లు ముందుకు వచ్చి హరితహారం కార్యక్రమం చేయడం అభినందనీయం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ సాగర్, జిల్లా నాయకులు దయాసాగర్, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ (TUWJ) అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎర్ర యాకయ్య, సీనియర్ జర్నలిస్ట్లు నిమ్మల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తీగల, విలేకరులు కైలాశ్, రాహుల్, హరికృష్ణ, ఆనంద్ రావు, రహమాన్, మహేందర్, శ్రీధర్, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ పై వేటు

Satyam NEWS

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వదిలేది లేదు

Satyam NEWS

వీణవంకలో తల్లీకుమార్తెల విషాదమరణం

Satyam NEWS

Leave a Comment