36.2 C
Hyderabad
May 15, 2024 18: 06 PM
Slider మహబూబ్ నగర్

మీడియాపై నిర్బంధం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు

#journalist

మీడియా నిర్బంధం, అణచివేత భారతదేశ ప్రజాస్వామ్యానికే పెనుముప్పని టియుడబ్ల్యూ జే( ఐజే యూ) వనపర్తి జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్ చెప్పారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వనపర్తిలోని రాజీవ్ చౌక్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా, శాంతియుత నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు అధ్యక్షత వహించారు. ఇటు పాలకులు, అటు మాఫియా, అక్రమార్కుల మధ్య మీడియా పాత్ర ప్రమాదంలో పడిందని చెప్పారు.

ఇళ్ల స్థలాలు, ఇండ్లు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ భద్రత, విధుల్లో రక్షణ కల్పించాలన్నారు. 2021లో జర్నలిస్టులకు బంద్ చేసిన 50 శాతం రాయితీపై రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మాధవరావు, జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యుడు మల్యాల బాలస్వామి, జర్నలిస్ట్ ఊషన్న, స్టాపర్ రాజు, ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొండన్న యాదవ్, టౌన్ ప్రధాన కార్యదర్శి మన్యం, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు నవీన్, ఉర్దూ పత్రిక రిపోర్టర్ కమల్ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శివ,జిల్లా ఉపాధ్యక్షుడు యాకుబ్ ,సీనియర్ జర్నలిస్ట్ పౌర్ణ రెడ్డి, అంజి,జర్నలిస్టులు, సీల్మార్థి ఆంజనేయులు, గోపాల్, బాబు, విష్ణు, శ్రీకాంత్,విజయ్ కుమార్, కుమార్,వహిద్,మోహన్ బాబు, నరసింహ రాజు, వేణు గోపాల్,తరుణ్,సురేష్, శేఖర్,చిన్న,శివశంకర్,రాజు,ఫరూక్ పాటిల్, సురేష్ , సి రాజు, తిరుపతి, అలిమ్, రాజు, పోలిశెట్టి సురేష్ కుమార్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

26న భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణకు ఘన నివాళి

Satyam NEWS

తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు పెండ్యాల కు నివాళులు

Satyam NEWS

Leave a Comment