38.2 C
Hyderabad
April 29, 2024 13: 33 PM
Slider ప్రత్యేకం

ఊరూవాడా కదలి రాగా సత్యమేవ జయతే విజయవంతం

#narabhuvaneswari

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 24 రోజులు కావస్తున్న నేపధ్యంలో గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సత్యమేవ జయతే కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిరాహార దీక్ష చేపట్టగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే నిరాహార దీక్ష చేపట్టారు.

ఢిల్లీలో ఎంపీ కనకమేడల నివాస గృహంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరాహార దీక్ష చేపట్టగా రాష్ట్ర వ్యాప్తంగా  తెలుగుదేశం పార్టీ కార్యాలయాలలో పార్టీ నాయకులు దీక్షకు దిగారు. అలానే నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ఎస్ ట్రస్ట్ భవనంలో దీక్షలు చేపట్టారు. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు.

వీరికి జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సత్యమేవ జయతే దీక్ష శిబిరంలో పాల్గొన్న ఆల్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వలలతో రగిలిపోయారు. జగన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలను ఎండగట్టారు. మరోవైపు సొంత మీడియాలో దీక్షలపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. అయితే స్వచ్ఛందంగా సత్యమేవ జయతే కార్యక్రమానికి వచ్చిన ఆల్ పార్టీ నేతలు అమ్ముడు బోయారని వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని అందుకుంది.

దీంతో రెచ్చిపోయిన కమ్యూనిస్టులు మమ్మల్ని కొనే మగాడు ఇంకా పుట్టలేదు రా.. బాతు బచ్చాలు .. అంటూ కౌంటర్ పంచ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు  తలపెట్టిన నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయి. అన్నీ పార్టీలు ఈ దీక్షకు మద్దతు పలికాయి.

రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బయటకు వచ్చి సంఘీభావం తెలిపుతున్నారు. దీంతో రాజకీయ వర్గాలతోపాటు అన్నీ వర్గాల వారు సత్యమేవ జయతే నిరాహార దీక్ష గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఈ  కార్యక్రమం విజయవంతమైయిందనే చెప్పాలి.

Related posts

పల్లె ప్రగతి స్పూర్తితోనే పట్టణ ప్రగతి కార్యక్రమం

Satyam NEWS

కన్నుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ముగింపు

Satyam NEWS

బోర్డులు పెట్టారు మరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు?

Satyam NEWS

Leave a Comment