35.2 C
Hyderabad
May 11, 2024 18: 12 PM
Slider హైదరాబాద్

జూనియర్ గెస్ట్ అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలి

#AIF

10 సంవత్సరాల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వేలాదిమంది లెక్చర్లను తొలగిస్తున్నట్లు, వారి స్థానంలో కొత్తగా నోటిఫికేషన్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నిర్ణయాన్ని సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని తొలగించిన అధ్యాపకుల ను విధుల్లోకి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని,ఉపాధిని కల్పించాల్సిన పాలకులు హక్కులను హరిస్తున్నారని వారు ఆరోపించారు.వాస్తవానికి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను అనేక సంవత్సరాలు గడిచినా భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని వారు ధ్వజమెత్తారు.

ఇన్ని సంవత్సరాలు గెస్ట్ అధ్యాపకులతో పని చేయించుకున్నారని, గెస్ట్ అధ్యపకులంతా రేపో మాపో శాశ్వత ఉద్యోగులుగా అవిర్భవిస్తారు అనే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్ప్రజాస్వామికమని వారు ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని వారు ఆరోపించారు.2015 సంవత్సరం లో కేవలం 10 వేల రూపాయల తో ఉద్యోగం ప్రారంభించిన అధ్యాపకులు,2018 నాటికి 21వేల రూపాయలకు చేరారని, ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని వారు అన్నారు.

తప్పుడు నివేదికలను కమీషనర్ రాష్ట్ర ప్రభుత్వం నికి పంపిస్తూ చిన్న ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మరల మెరిట్ నోటిఫికేషన్ ద్వారా అధ్యాపకుల ను భర్తీ చేస్తామని ప్రకటించడం సిగ్గు చేటని వారు అన్నారు. ఈ తొలగింపు కారణంగా వేలాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.

తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనియెడల అధ్యాపకుల పక్షాన ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుంది వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు నిర్లకంటి శ్రీకాంత్, టి. సత్య ప్రసాద్, లక్ష్మణ్ చారి పాల్గొన్నారు.

Related posts

Analysis: యువత మనసు ఎరగని ‘మన్ కి బాత్’

Satyam NEWS

మతి స్థిమితం లేని యువతిపై ఆసుపత్రిలో అత్యాచారం

Satyam NEWS

కేంద్ర వ్యవసాయ చట్టంతో కరివేపాకు రైతుకు మేలు

Satyam NEWS

Leave a Comment