38.2 C
Hyderabad
April 29, 2024 12: 34 PM
Slider జాతీయం

ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్

2022లో ప్రధాని మోదీ ఫస్ట్‌ విదేశీ టూర్‌ క్యాన్సిల్‌ అయ్యింది. జనవరి 6న ప్రధామంత్రి నరేంద్రమోదీ యూఏఈ వెళ్లాల్సి ఉంది. కానీ ఒమిక్రాన్ భయం కారణంగా ప్రధాని యూఏఈ పర్యటన వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోండటంతో ఈ పర్యటన వాయిదా వేసినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారత్-యూఏఈ మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన ఖరారు చేశారు అధికారులు.

2022లో ఇదే ప్రధాని తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. ఒకవేళ పర్యటనకు వెళ్తే, దుబాయ్ ఎక్స్‌పోలో ప్రధాని మోదీ పాల్గొనేవారు. వాతావరణం, జీవవైవిధ్యం, అంతరిక్షం, పట్టణ, గ్రామీణ అభివృద్ధి, ప్రపంచలక్ష్యాలు, ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయం, జీవనోపాధిపై యూఏఈతో మోదీ చర్చలు జరపాల్సి ఉంది. ఇంతకుముందు 2015, 2018, 2019లో యూఏఈని సందర్శించారు ప్రధాని మోదీ.

Related posts

మూడు భాషల్లో వస్తున్నఅనుష్క నిశ్శబ్దం

Satyam NEWS

“తెలంగాణ బత్తాయి డే” బ్రోచర్ ఆవిష్కరణ

Satyam NEWS

క‌రోనాను అరిక‌ట్టేందుకు యువ‌తే మేల్కొనాలంటూ డీఐజీ సందేశం…!

Satyam NEWS

Leave a Comment