28.7 C
Hyderabad
April 26, 2024 07: 03 AM
Slider ఖమ్మం

ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు

#ministerpuvvada

ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం 10వ డివిజన్ చైతన్య నగర్ నందు రూ. 36 లక్షలతో రెండు రోడ్లు, 18వ డివిజన్ శ్రీరాం హిల్స్ నందు రూ.39.50 లక్షలు మొత్తం రూ.75.50 లక్షలతో నిర్మించిన Vaccum Dewatered Flooring(VDF) రోడ్స్ ను మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు(SDF) రూ.30 కోట్ల నిధుల నుండి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 41 డివిజన్లలో 140 రోడ్స్ ఏర్పాటు చేయనున్నమన్నారు. ఖమ్మం కార్పొరేషన్ మొత్తం అవసరమైన చోట ప్రతి రోడ్డు ను సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు.

ప్రజలకు నిత్యం అవసరమయ్యే రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పించమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, DCCB చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ బచ్చు విజయ్, AMC చైర్మన్ ప్రసన్న లక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ లు చావా మాధురి నారాయణ రావు, మందడపు లక్ష్మీ మనోహర్, కమర్తపు మురళి, ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, నాయకులు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.

Related posts

సిద్దిపేట‌లో టీ హ‌బ్ ఏర్పాటు

Bhavani

టీవీ9 రవిప్రకాష్ పై మరో కొత్త కేసు నమోదు

Satyam NEWS

ఒకడు పోయాడు…. మరొకడు పోతాడు

Satyam NEWS

Leave a Comment