42.2 C
Hyderabad
May 3, 2024 16: 28 PM
Slider ప్రత్యేకం

50 శాతం అదనపు ఛార్జీతో సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

apsrtc 2

సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని అధికారులు కోరారు.

Related posts

టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఉపసంహరణ

Satyam NEWS

Tribute: రససిద్ధుడు మంగళంపల్లి బాలమురళి

Satyam NEWS

అంధుల పాఠశాలకు ఆదాల వింధ్యావళి లక్ష విరాళం

Satyam NEWS

Leave a Comment