39.2 C
Hyderabad
May 3, 2024 11: 37 AM
Slider నిజామాబాద్

రేపు మాస్టర్ ప్లాన్ బాధిత రైతులతో కెఏ పాల్ సమావేశం

#kapal

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ రేపు కామారెడ్డి జిల్లాకు రానున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులతో కెఏ పాల్ సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో నిన్నటి రైతుల సమావేశంలో రైతులు కీలక తీర్మానం చేశారు. కేసీఆర్ పై మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల నుంచి 15 మంది చొప్పున 100 నామినేషన్లు వేస్తామని ప్రకటించడం సంచలనం రేపింది.

ఈ పరిణామం బీఆర్ఎస్ కు మైనస్ గా మారుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటి నుంచి వారం రోజుల పాటు ఒక్కొక్క గ్రామంలో ఒక్కోరోజు సమావేశాలు నిర్వహించి రైతులను సంఘటితం చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో రేపు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో జరిగే రైతుల సమావేశంలో కెఏ పాల్ పాల్గొననున్నారు. రైతులతో ప్రత్యేకంగా సమావేశమై మాస్టర్ ప్లాన్ పై చర్చించనున్నారు. రైతులకు మద్దతుగా సీఎం కేసీఆర్ పై పోటీ చేసే విషయాన్ని సైతం రైతులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ ఉద్యమ సమయంలో రైతులకు మద్దతుగా కెఏ పాల్ నిలిచిన విషయం తెలిసిందే. కామారెడ్డికి కెఏ పాల్ వచ్చి కలెక్టర్ తో మాట్లాడి అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రైతులకు మద్దతుగా ఆయన హైకోర్టులో పిల్ వేసి రైతులకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో రేపు కెఏ పాల్ రావడం ఆసక్తికరంగా మారింది.

Related posts

ఏపిలో స్వేచ్ఛ కోసం రోడ్డెక్కబోతున్న మీడియా

Satyam NEWS

కీలకమైన రెండు కేసులు….: ఈ సీబీఐ కి ఏమైంది?

Satyam NEWS

ఎరువుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు

Bhavani

Leave a Comment